సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్‌లో అత్యున్నత జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఒకటి. జట్టు నిండా నైపుణ్యం, ఉన్న ఆటగాళ్లే. ఫార్మాట్‌తో పనిలేకుండా విరుచుకుపడే కోహ్లీ, గ్రౌండ్‌లో అన్ని వైపులా ఫీల్డర్లను పరిగెత్తించగల ఏబీ డివిలియర్స్, ప్రత్యర్థికి చుక్కలు చూపించే డికాక్, మెక్‌కల్లమ్, తనదైన రోజున విరుచుకుపడే యువ కెరటం సర్ఫరాజ్, ఇలా జట్టు నిండా ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు ఏమాత్రం కొదవ లేదు. అయినా అన్నీ ఉండి ఎవరి నోట్లోనో శని అన్నట్లు బెంగుళూరు జట్టు మాత్రం బరిలో ఎందుకు రాణించలేక పోతోంది.
బెంగుళూరు జట్టు ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో మాత్రమే గెలిచి, మూడింటిలో ఓటమిని మూటగట్టుకుంది. జట్టు మొత్తం సమిష్టిగా పోరాడాల్సింది పోయి ఇద్దరి మీదనే జట్టు మొత్తం ఆధారపడుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ మినహా ఏ ఒక్కరు రాణించలేక పోయారు. దీంతో పాయింట్ల పట్టికలో రోజురోజుకు కిందకు వెళ్తోంది. ఈ విషయం ఐదు గత ఐదు మ్యాచ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విషయం బోధపడుతుంది.
ఈ సీజన్‌లో బెంగుళూరు తరపున కోహ్లీ 231 పరుగులు, ఏబీ 212 పరుగులు (ఐదు మ్యాచ్‌ల్లో) చేశారు. అంతే కాకుండా బెంగుళూరు తరపున నాలుగు అర్థ సెంచరీలు నమోదు అవ్వగా కోహ్లీ రెండు (57, 92), డివిలియర్స్ రెండు(57,90) చేసినవే. మినహా ఏ ఇతర ఆటగాడు తమస్థాయిలో రాణించలేక పోయారు. ఇప్పటి వరకూ జట్టు 849 పరుగులు చేయగా వీరిద్దరు చేసిన పరుగులే 443 ఉన్నాయి. అంటే బెంగుళూరు జట్టు కోహ్లీ, డివిలియర్స్ మీద ఏవిధంగా ఆధారపడిందో అర్థం చేసుకోవచ్చు.
మ్యాచ్‌లు జరిగే కొద్ది జట్టుపై వత్తిడి పెరుగుతోంది. ఇప్పటికైన ఇతర ఆటాగాళ్లు తన స్థాయికి తగ్గట్లు ఆడి జట్టును విజయాల బాట పట్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక బెంగుళూరు నేడు, వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నైను ఢీకొట్టబోతోంది. చెన్నై ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో విజయం తమనే వరిస్తుందని చెన్నై అభిమానులు చెబుతున్నారు. మరి కోహ్లీ సేన ధోనికి పోటి ఇస్తుందో లేదో.
Comments
Please login to add a commentAdd a comment