
కరాచీ:ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ చీఫ్ కోచ్ గా సేవలందిస్తున్న మికీ ఆర్థర్ పదవీ కాలాన్ని వరల్డ్ కప్ వరకూ పొడిగించారు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మికీ ఆర్థర్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత పాకిస్తాన్ జట్టు ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దాంతో ఆర్థర్ పని తీరుపై సంతృప్తి చెందిన పీసీబీ అతని పదవీ కాలాన్ని మరి కొంతకాలం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 2019 వరల్డ్ కప్ వరకూ పాక్ జట్టు కోచ్ ఆర్థర్ కొనసాగుతాడని పీసీబీ అధికారి ఒకరు వెల్లడించారు.
2016 మే నెలలో ఆర్థర్ పాక్ క్రికెట్ ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల కాలానికి ఆర్థర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. మరో కొన్ని నెలల్లో ఆర్థర్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు దాన్ని పొడగించింది.
, ,,