ధోనితో జర జాగ్రత్త.. | Pakistan should be wary of MS Dhoni | Sakshi
Sakshi News home page

ధోనితో జర జాగ్రత్త..

Published Fri, Jun 2 2017 4:48 PM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

ధోనితో జర జాగ్రత్త..

ధోనితో జర జాగ్రత్త..

లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తో జరిగే కీలక పోరులో మహేంద్ర సింగ్ ధోనితో జాగ్రత్తగా ఉండాలని పాకిస్తాన్ మాజీ ఆటగాడు అమీర్ సొహైల్ తమ ఆటగాళ్లను హెచ్చరించాడు. మ్యాచ్ గతిని మార్చడంలో ధోనికి సాటి ఎవరూ లేరంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని విషయంలో పాక్ ఆటగాళ్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశాడు.

'ధోనికున్న పరిమితమైన వనరులతోనే మ్యాచ్లను గెలిపించిన సందర్భాలు అనేకం. అతను ఎప్పటికీ మ్యాచ్ విన్నరే. ధోని విషయంలో పాక్ జాగ్రత్తగా ఉండాలి. ధోని ఒక ప్రమాదకర బ్యాట్స్మన్ అనే సంగతి గుర్తుపెట్టుకుని ఆడండి'పాక్ మాజీ ఓపెనర్ సోహైల్ పేర్కొన్నాడు. అతను బ్యాట్స్మన్ గానే కాకుండా వికెట్ కీపర్ గా కూడా అనేక మ్యాచ్లను గెలిపించిన విషయాన్ని సొహైల్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ధోని క్రీజ్లో  కుదురుకుంటే మ్యాచ్ను తమవైపుకు లాగేసుకుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో జూన్ 4వ తేదీన భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య వన్డే జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement