పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్
బకింగ్‌హామ్‌షైర్ (ఇంగ్లండ్): పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు సత్తా చాటారు. ఈ టోర్నీలో మన ఆటగాళ్లు మొత్తం 11 పతకాలు గెలుచుకున్నారు. ఇందులో నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో (ఎస్‌ఎల్ 4 కేటగిరీ) తరుణ్ తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ తరుణ్ 18-21, 21-10, 21-15తో ల్యూకాస్ మాజుర్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు.
పురుషుల సింగిల్స్ (ఎస్‌ఎల్ 3 కేటగిరీ)లో ప్రమోద్ భగత్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో భగత్ 16-21, 21-3, 21-16తో డిఫెండింగ్ చాంపియన్ ఫామ్ ట్రంగ్ (వియత్నాం)పై సంచలన విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ (ఎస్‌ఎస్3 ఎస్‌ఎల్4)లో స్వర్ణ, రజతాలతో పాటు మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా భారత్ స్వర్ణం గెలుచుకుంది. పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది.
భారత్‌కు 11 పతకాలు
Published Mon, Sep 14 2015 11:54 PM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM
Advertisement