పట్నా: రైడింగ్‌లో అదరగొట్టిన పట్నా పైరేట్స్ జట్టు.... ప్రొ కబడ్డీ లీగ్‌లో మరో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 36-32తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. దీంతో ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 43 పాయింట్లు సాధించిన పైరేట్స్... టాప్‌లో కొనసాగుతోంది. బుల్స్ జట్టు రెండు విజయాలతో 13 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన పైరేట్స్ క్యాచింగ్‌లోనూ తమ జోరు చూపెట్టింది. పట్నా ఆటగాళ్లు రోహిత్ కుమార్ (13), దీపక్ నర్వాల్ (9) సూపర్ రైడింగ్‌తో ప్రత్యర్థి జట్టును వణికించారు.