హ్యూస్కు 63 సెకండ్ల పాటు నివాళి | Players, crowd give 63-second tribute to Hughes | Sakshi

హ్యూస్కు 63 సెకండ్ల పాటు నివాళి

Dec 9 2014 8:50 AM | Updated on Sep 2 2017 5:54 PM

హ్యూస్కు 63 సెకండ్ల పాటు నివాళి

హ్యూస్కు 63 సెకండ్ల పాటు నివాళి

బౌన్సర్ బంతి తగిలి ప్రాణాలు కోల్పోయిన ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్కు భారత్-ఆస్ట్రేలియా మొదటి టెస్టు సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.

బౌన్సర్ బంతి తగిలి ప్రాణాలు కోల్పోయిన ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్కు భారత్-ఆస్ట్రేలియా మొదటి టెస్టు సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్లో సరిగ్గా 63 పరుగులు చేసిన సమయంలో మొత్తం ఆటగాళ్లు, చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కలిసి 63 సెకండ్ల పాటు నిలబడి నివాళులు అర్పించారు. రెండు జట్ల సభ్యులు నల్లటి ఆర్మ్ బ్యాండ్లు ధరించి హ్యూస్ను తలుచుకున్నారు.

సిడ్నీ క్రికెట్ గ్రౌండులో నవంబర్ 25వ తేదీన సీన్ అబాట్ విసిరిన బౌన్సర్ మెడభాగంలోని కీలకమైన నరానికి తగలడంతో మెదడుకు రక్తసరఫరా నిలిచిపోయి, రెండు రోజుల తర్వాత హ్యూస్ మరణించిన విషయం తెలిసిందే. సరిగ్గా 63 సెకండ్ల పాటు నివాళి కొనసాగింది. టాస్ గెలిచిన సమయంలో కూడా ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ తన సహచరుడిని తలుచుకున్నాడు. హ్యూస్ లేకపోవడం పెద్దలోటేనని, అతడు ఎప్పుడూ తన మదిలో ఉంటాడని అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement