భజ్జీ రిసెప్షన్‌కు మోదీ! | PM Narendra Modi May Attend Harbhajan Singh's Reception | Sakshi
Sakshi News home page

భజ్జీ రిసెప్షన్‌కు మోదీ!

Published Thu, Oct 29 2015 12:38 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

భజ్జీ రిసెప్షన్‌కు మోదీ! - Sakshi

భజ్జీ రిసెప్షన్‌కు మోదీ!

ఫగ్వరా: క్రికెటర్ హర్భజన్ సింగ్, బాలీవుడ్ నటి గీతా బస్రా నేడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. పంజాబ్‌లోని ఫగ్వారాలో నేడు వీరి వివాహం జరుగనుంది. జలంధర్‌లో బుధవారం అట్టహాసంగా జరిగిన వేడుకలో ఈ జంట వివాహ ఉంగరాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది బంధుమిత్రులు హాజరుకానున్నారు. నవంబర్ 1న భజ్జీ-బస్రా దంపతులు ఢిల్లీలో వివాహ విందు (రిసెప్షన్) ఇవ్వనున్నారు.

ఈ విందుకు క్రికెటర్లు యువరాజ్‌సింగ్, విరాట్ కోహ్లితోపాటు బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ హాజరుకానున్నరు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఈ విందుకు హాజరై.. నూతన దంపతులను ఆశ్వీరవదించే అవకాశముందని తెలుస్తున్నది. చాలాకాలంగా ప్రేమించుకుంటున్న హర్భజన్ సింగ్, గీతా బస్రా ఇటీవల పెళ్లికి ఓకే చెప్పిన సంగతి తెలిసింది. వివాహం అనంతరం రంజీ ట్రోఫీలో ఆడాలని 35 ఏళ్ల హర్భజన్ సింగ్ భావిస్తున్నారు. తన స్పిన్‌ బౌలింగ్‌తో ప్రపంచంలోని మేటి జట్లకు వణుకు పుట్టించిన భజ్జీ  మొత్తం 103 టెస్టులు ఆడి 417 వికెట్లు తీశాడు. వన్డేలు, ట్వంటీ-20ల్లోనూ తన సత్తా చాటాడు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement