
న్యూఢిల్లీ: తెలుగు అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు అరుదైన అవకాశం దక్కింది. ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన ఆరుగురు సభ్యుల భారత మహి ళల టెన్నిస్ జట్టులోకి ప్రాంజల ఎంపికైంది. సానియా మీర్జా తర్వాత ఒక హైదరాబాదీ అమ్మాయికి టెన్నిస్‌లో ఆసియా క్రీడల్లో ఆడే అవకాశం లభించడం ఇదే మొదటిసారి.
19 ఏళ్ల ప్రాంజల ఐటీఎఫ్ సర్క్యూట్‌లో వరుస విజయాలతో సత్తా చాటింది. భారత జట్టులో ప్రాంజలతో పాటు అంకితా రైనా, కర్మన్‌కౌర్ థండి, రుతుజా భోస్లే, రియా, ప్రార్థన కూడా ఉన్నారు. మహిళల టీమ్‌కు అంకితా బాంబ్రీ నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment