
జైపూర్ ‘సిక్సర్’
కోల్‌కతా: అటాకింగ్‌లో దూకుడు చూపెట్టిన జైపూర్ పింక్ పాంథర్స్... ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 33-27తో పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. అమిత్ హుడా (3), రన్ సింగ్ (2)లు డిఫెన్స్‌లో సత్తా చాటితే... జస్వీర్ సింగ్ (7) రైడింగ్‌లో చెలరేగిపోయాడు. ఫలితంగా పుణేను రెండుసార్లు ఆలౌట్ చేశారు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 33-27తో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది. దీంతో 8 విజయాలతో 41 పాయింట్లతో టాప్‌లో నిలిచింది.
పట్నా తరఫున ప్రదీప్ (9), ఫజల్ (7), సుర్జీత్ (6), రాజేశ్ (3), ధర్మరాజ్ (3)లు రాణించారు. మోను గోయట్ (9), కున్ లీ (7), అమిత్ (4), సుర్జీత్ నర్వాల్ (3) వారియర్స్‌కు పాయింట్లు అందించారు. సోమవారం జరిగే ఏకైక మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది.