హామిల్టన్: ఇటీవల టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా ఈ ఫార్మాట్‌లో వంద అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి న్యూజిలాండ్ క్రికెటర్‌గా గుర్తింపు సాధించిన రాస్ టేలర్.. ఇక వంద టెస్టు ఆడటానికి సిద్ధమవుతున్నాడు. టీమిండియాతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో టేలర్ ఈ ఫీట్‌ను అందుకుంటాడు. దాంతో మూడు ఫార్మాట్లలో వంద అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకోబోతున్న తొలి క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించనున్నాడు. దీనిపై టేలర్ మాట్లాడుతూ.. ‘ ఈ సుదీర్ఘ జర్నీ చాలా సంతోషాన్నిచ్చింది. న్యూజిలాండ్ తరుఫున ఇంతటి క్రికెట్ ఆడటం గౌరవంగా భావిస్తున్నా. నా కోసం ఫ్యామిలీ చాలా త్యాగాలు చేసింది. నేను వరుసగా క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతూ ఉండటంపై ఫ్యామిలీని చాలా మిస్సయ్యాను. నా భార్యే పిల్లలకు అన్నీ దగ్గరుండి చూసుకుంది. ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఇక్కడ వరకూ వచ్చా. ఫ్యామిలీ సహకారం లేకపోతే ఈ లాంగ్ జర్నీ ఉండేది కాదు. మా పిల్లలు కూడా నా పరిస్థితిని అర్ధం చేసుకున్నారు.
దక్షిణాఫ్రికాతో నా తొలి టెస్టు సిరీస్ తర్వాత ఇన్ని మ్యాచ్‌లు ఆడతానని ఊహించలేదు. వరుసగా ప్రతీ మ్యాచ్ ఆడుతూ ఉండట నిజంగా అదృష్టం. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో వంద మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌ను తానే కావొచ్చు.. కానీ చాలా మంది ఆటగాళ్లు దాన్ని చేరుకుంటారనే ఆశిస్తున్నా. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తర్వాత నా టెస్టు కెరీర్‌పై నమ్మకం ఏర్పడింది. మాంచెస్టర్‌లో నేను సాధించిన 158 పరుగులు నా అత్యుత్తమ ఇన్నింగ్స. అలాగే శ్రీలంకపై కొలంబోలో 140, 170 పరుగులు కూడా ఎప్పటికీ మరచిపోలేను. ఆస్ట్రేలియాపై చేసిన 290 స్కోరు కూడా నా కెరీర్ ఇన్నింగ్స్ అత్యుత్తమల్లో ఒకటి. నేను ఎప్పుడూ ఏదొకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు నా పిల్లలు పర్యటనలు చేయడానికి ఇష్టపడుతున్నారు. నా కూతురు భారత్ పర్యటనకు వెళదామని అంటోంది’ అని టేలర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment