పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లోభాగంగా గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత ఫీల్డింగ్ కు మొగ్గు చూపాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.
ఈ మ్యాచ్ లో గెలిచి ఆ లెక్కను సరిచేయాలని భావిస్తోంది పుణె. ఇప్పటివరకూ పుణె తొమ్మిది మ్యాచ్ లకు గాను ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉండగా,గుజరాత్ లయన్స్ తొమ్మిది మ్యాచ్ ల్లో నాలుగింట మాత్రమే విజయం సాధించి ఆరో స్థానంలో ఉంది.