Pune super giant
-
చివరి ఓవర్ లో వ్యూహం అదే..
-
వాషింగ్టన్ సుందర్ కొత్త రికార్డు
హైదరాబాద్: ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరపున బరిలోకి దిగిన వాషింగ్టన్ సుందర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్ ఆడిన అత్యంత పిన్నవయస్కుడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్-10లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్ తో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా వాషింగ్టన్ సుందర్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఫైనల్లో పాల్గొనే సమయానికి అతని వయసు 17 సంవత్సరాల 228 రోజులు. తద్వారా అంతకుముందు రవీంద్ర జడేజా పేరిట ఉన్న రికార్డును సుందర్ అధిగమించాడు. 2008లో రవీంద్ర జడేజా ఐపీఎల్ ఫైనల్ ఆడే సమయానికి అతని వయసు 19 ఏళ్ల 178 రో్జులు. అదే ఇప్పటి వరకూ ఐపీఎల్ ఫైనల్ ఆడిన పిన్నవయస్కుడి రికార్డుగా ఉంది. దాన్ని తాజాగా వాషింగ్టన్ సెందర్ సవరించాడు. గాయంతో దూరమైన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో సుందర్ ఎంపికైన సంగతి తెలిసిందే. అశ్విన్ లోటును భర్తీ చేసేందుకు సుందర్ ఎంపిక చేసింది పుణె. సుందర్ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి స్పిన్ బౌలర్. బంగ్లాలో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్ జట్టులో సుందర్ కీలక ఆటగాడు. విజయ్‌హజారే, దేవధర ట్రోఫిల్లో తమిళనాడు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. అశ్విన్ స్థానానికి సుందర్ జమ్ముకశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్‌తో పోటి పడ్డాడు. వీరిద్దరి మద్య పుణె జట్టు నెట్స్‌లో బౌలింగ్ పరీక్ష చేసింది. వీరిద్దరూ పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్, మహేంద్ర సింగ్ ధోని, బెన్ స్ట్రోక్స్ లకు నెట్స్‌లో బౌలింగ్ చేశారు. అయితే సుందర్ కెప్టెన్ స్మిత్ వికెట్ పడగొట్టడంతో అవకాశం పొందాడు. వాషింగ్టన్ ఎంపికలో పుణె వ్యూహం ఫలించిందనే చెప్పాలి. కీలక మ్యాచ్ లో సాధారణ స్కోరును కాపాడుకుని పుణె విజయంలో సాధించడంలో సుందర్ పాత్ర వెలకట్టలేనిది. రోహిత్ శర్మ, అంబటి రాయుడు, పొలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లను తన స్పిన్ మ్యాజిక్ తో బోల్తా కొట్టించి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. -
చివరి ఓవర్ లో వ్యూహం అదే..
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10వ సీజన్ టైటిల్ ను ముంబై ఇండియన్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. చివరి బంతి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో ముంబై ఇండియన్స్ పైచేయి సాధించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. కేవలం పరుగు తేడాతో రైజింగ్ పుణెను ఓడించి ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. తద్వారా ఐపీఎల్ ట్రోఫీని మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ కొత్త చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉంచితే, అసలు చివరి ఓవర్ లో తమ వ్యూహం అమలు చేసిన తీరును మ్యాచ్ ముగిసాక ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. 'చివరి ఓవర్లో పుణె విజయానికి 11 పరుగుల మాత్రమే కావాలి. అప్పటికి పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇంకా అవుట్ కాకపోవడంతో మాకు విజయావకాశాలు తక్కువగానే ఉన్నాయి. స్మిత్ ను కట్టడి చేస్తే గెలుపును సొంతం చేసుకోవచ్చనేది మా ప్రణాళిక. ఆ మేరకు చివరి ఓవర్ వేయడానికి వచ్చిన మిచెల్ జాన్సన్‌తో చర్చించా. సాధ్యమైనంత వరకూ స్మిత్ బంతిని పేస్ చేయకుండా విధంగా బౌలింగ్ చేయమనే చెప్పా. అతను పేస్ బౌలింగ్ ను ఎలా పేస్ చేస్తాడో మనం అంతకుముందు చూశాం. మరొకవైపు అప్పుడు జాన్సన్ గాలికి వ్యతిరేక దిశలో బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో స్మిత్ ను గాల్లోకి బంతిని హిట్ చేసేలా చేయాలనుకున్నాం. అప్పుడు గాల్లోకి బంతి లేపితే కచ్చితంగా మాకు అనుకూలంగా ఉంటుందనే అనుకున్నాం. ఆ రకంగా ముందు స్మిత్ విషయంలో సక్సెస్ అయ్యాం. ఆపై పుణె పై ఒత్తిడి పెంచి టైటిల్ సాధించాం' అని రోహిత్ పేర్కొన్నాడు. ఆఖరి ఓవర్లో పుణె విజయానికి 11 పరుగులు కావల్సిండగా జాన్సన్ వేసిన తొలిబంతిని మనోజ్ తివారీ బౌండరీ బాదడంతో పుణె సునాయసంగా విజయాన్ని సాధిస్తుందని భావించారు. కానీ రెండో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నించిన మనోజ్ లాంగ్ ఆన్ లో పోలార్డ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అయినా అర్ధసెంచరీ చేసిన స్మిత్ క్రీజులో ఉండటంతో విజయం పుణె నే వరిస్తుందనుకున్నారు. కాగా మూడో బంతికి స్మిత్ గాల్లోకి లేపి అంబటి రాయుడుకు చిక్కాడు. చివరి మూడు బంతులకు 7 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ బై రన్ తీశాడు. బ్యాటింగ్ కు వచ్చిన క్రిస్టియన్ ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా రెండు పరుగులు తీసి మూడో పరుగుల తీసే ప్రయత్నంలో క్రిస్టియన్ రనౌటయ్యాడు. దీంతో టైటిల్ ముంబై సొంతమైంది. -
ముంబై ఇండియన్స్ కొత్త చరిత్ర
హైదరాబాద్: ముంబై ఇండియన్స్ అద్భుతం చేసింది. టోర్నీ ఆద్యంతం నిలకడను ప్రదర్శించిన రోహిత్ సేన తుది పోరులో సైతం సత్తా చాటుకుని మరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. చివర బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ముంబై ఇండియన్స్ పరుగు తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుంది. తద్వారా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుని ఈ టైటిల్ మూడుసార్లు అందుకున్న తొలి జట్టుగా కొత్త చరిత్ర సృష్టించింది. మరొకవైపు స్టీవ్ స్మిత్ గ్యాంగ్ గెలుపు అంచులవరకూ వచ్చి చతికిలబడింది. ఆదివారం ఇక్కడ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన తుది పోరులో ముంబై ఇండియన్స్ చిరస్మరణీయమైన విజయం సాధించింది. చివరి మ్యాచ్ లో ఆద్యంత ఆకట్టుకున్న ముంబై బౌలర్లు గెలుపులో ప్రధాన భూమిక పోషించారు. ముంబై బౌలర్లలో మిచెల్ జాన్సన్ మూడు వికెట్లు సాధించగా, బూమ్రా రెండు వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్ విసిరిన 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒత్తిడికి గురైన పుణె పోరాడి ఓటమి చెందింది. పుణె ఆటగాళ్లలో అజింక్యా రహానే(44),స్టీవ్ స్మిత్(51) రాణించినా జట్టుకు విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఉత్కంఠ రేపిన చివరి ఓవర్ చివరి ఓవర్లో పుణె విజయానికి 11 పరుగులు కావల్సిండగా జాన్సన్ వేసిన తొలిబంతిని మనోజ్ తివారీ బౌండరీ బాదడంతో పుణె సునాయసంగా విజయాన్ని సాధిస్తుందని భావించారు. కానీ రెండో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నించిన మనోజ్ లాంగ్ ఆన్ లో పోలార్డ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అయినా అర్ధసెంచరీ చేసిన స్మిత్ క్రీజులో ఉండటంతో విజయం పుణె నే వరిస్తుందనుకున్నారు. మూడో బంతికి స్మిత్ కూడా భారీ షాట్ కు ప్రయత్నించి అంబటి రాయుడుకు చిక్కాడు. చివరి మూడు బంతులకు 7 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ బై రన్ తీశాడు. బ్యాటింగ్ కు వచ్చిన క్రిస్టియన్ ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా రెండు పరుగులు తీసి మూడో పరుగుల తీసే ప్రయత్నంలో క్రిస్టియన్ రనౌటయ్యాడు. దీంతో టైటిల్ ముంబై సొంతమైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు పార్ధీవ్ పటేల్(4), సిమన్స్(3) లు తీవ్రంగా నిరాశపరచడంతో ముంబైకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరిద్దరూ జట్టు స్కోరు ఎనిమిది పరుగుల వద్ద నిష్ర్కమించడంతో ముంబైకు షాక్ కు గురైంది. ఆపై అంబటి రాయుడు-రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు యత్నించారు. అయితే వీరిద్దరూ 33 పరుగుల్ని జత చేసిన తరువాత రాయుడు(12) రనౌట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో రోహిత్ శర్మ కూడా అవుట్ కావడంతో ముంబై తేరుకోలేకపోయింది. ఓ దశలో వంద పరుగుల్ని కూడా చేరడం కూడా కష్టంగా అనిపించిన తరుణంలో కృనాల్ పాండ్యా ఆదుకున్నాడు. సమయోచిత బ్యాటింగ్ తో 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేయడంతో ముంబై మూడంకెల స్కోరుకు చేరగల్గింది. -
పుణె ఫీల్డింగ్ అదుర్స్...
-
పుణె ఫీల్డింగ్ అదుర్స్...
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 టైటిల్ పోరులో భాగంగా ఆదివారం రాత్రి ఇక్కడ రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో టాపార్డర్ విఫలం కావడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ముంబై ఆటగాళ్లలో కృనాల్ పాండ్యా(47), రోహిత్ శర్మ(24) లు మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పార్ధీవ్ పటేల్(4), సిమన్స్(3) లు తీవ్రంగా నిరాశపరిచారు. వీరిద్దరూ జట్టు స్కోరు ఎనిమిది పరుగుల వద్ద నిష్ర్కమించడంతో ముంబైకు షాక్ కు గురైంది. ఆపై అంబటి రాయుడు-రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు యత్నించారు. అయితే వీరిద్దరూ 33 పరుగుల్ని జత చేసిన తరువాత రాయుడు(12) రనౌట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో రోహిత్ శర్మ కూడా అవుట్ కావడంతో ముంబై తేరుకోలేకపోయింది. ఓ దశలో వంద పరుగుల్ని కూడా చేరడం కూడా కష్టంగా అనిపించిన తరుణంలో కృనాల్ పాండ్యా ఆదుకున్నాడు. సమయోచిత బ్యాటింగ్ తో 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఫీల్డింగ్ అదుర్స్.. అమీతుమీ తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో పుణె ఫీల్డింగ్ లో అదుర్స్ అనిపించింది. ముంబై ఇండియన్స్ ఇచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని పుణె ఫీల్డర్లు వదల్లేదు. ముంబై ఇండియన్స్ ఓపెనర్ సిమన్స్ ను రిటర్న్ క్యాచ్ రూపంలో ఉనద్కత్ అద్భుతంగా అందుకున్నతీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. బంతి కింది పడబోయే సమయంలో ఉనద్కత్ మెరుపు వేగంతో ఒడిసి పట్టుకుని శభాష్ అనిపించాడు. ఆ తరువాత అంబటి రాయుడ్ని స్టీవ్ స్మిత్ రనౌట్ చేసిన తీరు అమోఘం. ఈ రెండు ఒక ఎత్తయితే ఆడమ్ జంపా బౌలింగ్ లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద శార్దూల్ ఠాకూర్ అందుకున్న వైనం మ్యాచ్ కే హైలెట్. ఆపై కరణ్ శర్మను శార్దూల్ ఠాకూర్ రనౌట్ చేసిన తీరు ఆకట్టుకుంది. ఇక్కడ కరణ్ శర్మ ఇచ్చిన స్లిప్ క్యాచ్ ను ముందు క్రిస్టియన్ వదిలేశాడు. కాగా, అప్పటికే కరణ్ శర్మ క్రీజ్ ను వదిలేసి ముందుకు వెళ్లి పోయాడు. ఆ సమయంలో సమయ స్ఫూర్తితో వ్యవహరించిన బౌలర్ శార్దూల్ ఠాకూర్.. క్రిస్టియన్ విసిరిన బంతిని చాకచక్యంగా అందుకుని రనౌట్ చేశాడు. ఒకవైపు మైమరించే క్యాచ్‌లు, మరొకవైపు అద్భుతమైన రనౌట్లతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశారు పుణె ఆటగాళ్లు. -
స్టీవ్ స్మిత్.. భావోద్వేగ సందేశం
హైదరాబాద్: ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టీవ్ స్మిత్.. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫైనల్ కు కొద్ది గంటల ముందు భావోద్వేగ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాదాపు నాలుగు నెలల భారత్ పర్యటనలో ఉన్న తనకు ఇక్కడ ప్రజలు చూపించిన ప్రేమాభిమానులు మరవలేనివిగా పేర్కొన్నాడు. ' నా సుదీర్ఘ జర్నీ నిజంగా అద్భుతంగా ఉంది. ఇక్కడ చాలా ఎత్తు పల్లాలు చవిచూడటమే కాకుండా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కొంతమంది ప్రజల్ని కూడా కలిశాను. ఈ క్రమంలోనే కొంతమంది కొత్త ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. ఐపీఎల్ ఆడటం అనేది అదొ గొప్ప అనుభవంగా భావిస్తున్నా. ఐపీఎల్ ఫైనల్ తరువాత కేవలం ఇక్కడ ఒక రాత్రి మాత్రమే ఉంటా. భారత్ లో ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు. మా జట్టుకు మద్దతు తెలిపిన అభిమానులకు సైతం కృతజ్ఞతులు. ఈ పర్యటన ఎప్పటికీ నాకు గొప్ప జ్ఞాపకంగా గుర్తుండి పోతుంది'అని స్టీవ్ స్మిత్ తన ఇన్‌స్టా గ్రాం అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆదివారం రాత్రి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రైజింగ్ పుణె-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్ తో తొలిసారి పుణె తలపడతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా కొత్త చరిత్రను లిఖిస్తారు. మరి టైటిల్ పోరులో విజేత ఎవరో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. -
పుణె సక్సెస్ కు కారణం ఇదే..
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టు రైజింగ్ పుణె సూపర్ జెయింట్. అయితే ఆ జట్టు తుది సమరానికి సిద్ధమై మేటి జట్లను సైతం ఔరా అనిపించింది. ఇదిలా ఉంచితే, ఐపీఎల్ ఆరంభానికి ముందు పుణె జట్టు సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనిని తప్పించి ఆ బాధ్యతల్ని స్టీవ్ స్మిత్ కు అప్పగించింది. దీనిపై అప్పట్లో దుమారం చెలరేగినప్పటికీ, ఆ తరువాత అంతా సర్దుకుంది. ఇక్కడ ధోని కూడా తనను కెప్టెన్సీ నుంచి తప్పించారనే విషయాన్ని పట్టించుకోకుండా మిస్టర్ కూల్ తరహాలో అప్పచెప్పిన పనిని సమర్ధవంతంగా చేసుకుపోవడంతో జట్టులో ఎటువంటి విభేదాలు చోటు చేసుకోలేదు. దీన్ని కాసేపు పక్కకు ఉంచితే, ఈ సీజన్ లో పుణె జట్టు స్వల్ప మార్పుతో బరిలోకి దిగింది. గత సీజన్ పుణె సూపర్ జెయింట్స్ గా వచ్చి నిరాశపరిచిన పుణె.. ఈసారి పుణె సూపర్ జెయింట్ గా పోరుకు సిద్ధమైంది. కేవలం జట్టు పేరులో 'ఎస్' అనే చివరి అక్షరాన్ని తొలగించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. ఇలా పేరు మార్చడానికి న్యూమరాలజీ(సంఖ్యా శాస్త్రం)నే కారణమంటున్నాడు పుణె యజమాని సంజీవ్ గోయంకా. తనకు సంఖ్యాశాస్త్రంపై పెద్దగా నమ్మకం లేకపోయినప్పటికీ, పేరు మార్చి చూస్తే ఏంపోతుంది అనే ఉద్దేశంతోనే అలా చేసినట్లు పేర్కొన్నాడు. ఇది పుణె జట్టును ఫైనల్ వరకూ చేర్చడంలో సహకరించిందంటూ తెగ ఆనందపడిపోతున్నాడు. -
నిఘా నీడలో ఉప్పల్ స్టేడియం
హైదరాబాద్: ముంబై ఇండియన్స్- రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగే ఐపీఎల్–10 ఫైనల్ సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో ఉప్పల్ స్టేడియం చుట్టూ, లోపల పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి రాచకొండ పోలీసులు స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి బాంబ్, డాగ్ స్క్వాడ్లతో స్టేడియం లోపల, బయట అణువణువూ చెక్ చేశారు. స్టేడియం బయట అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గత మ్యాచ్‌లతో పోలిస్తే ఈ మ్యాచ్‌కు గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు పటిష్ట బందోబస్తును కల్పించారు. 1,800 మంది పోలీస్ సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. 870 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, 250 సెక్యూరిటీ వింగ్, 270 ట్రాఫిక్ సిబ్బంది, 88 సీసీ కెమెరాలతో బందోబస్తు నిర్వహించారు. -
అడుగు దూరంలో ధోని..
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తుది పోరుకు అర్హత సాధించడంలో మహేంద్ర సింగ్ ధోని తనవంతు పాత్రను సమర్ధవంతంగా పోషించాడని భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీ ఆరంభానికి ముందు ఎన్నో ఛీత్కారాలను ఎదుర్కొన్న ధోని.. ప్రస్తుతం తనను తాను నిరూపించుకోవడానికి కేవలం అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడని అజహరుద్దీన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ధోనిని పుణె జట్టు కెప్టెన్ గా తప్పించడాన్ని తప్పుబట్టాడు. గతంలో ఆరు ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన అనుభవం ఉన్నధోని ఈ సీజన్ ఫైనల్ పోరులో రాణించి కప్ ను జట్టుకు అందిచిన పక్షంలో తనను పూర్తిగా నిరూపించుకున్నట్లు అవుతుందన్నాడు. 'కెప్టెన్ గా ధోని ఎప్పుడూ గెలిచాడు. ప్రస్తుతం ఆటగాడిగా ధోని నిరూపించుకోవాలనే యత్నంలో ఉన్నాడు. కెప్టెన్ గానే కాదు.. ఆటగాడిగా గెలవగలను అని నిరూపించుకునే సమయం ధోని ముందుంది. ఇందుకు కేవలం పాయింట్ దూరంలో మాత్రమే ధోని ఉన్నాడు. అతన్ని రైజింగ్ పుణె జట్టు కెప్టెన్ గా తప్పించడాన్ని నేను ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్ధించను. కానీ ధోని-స్టీవ్ స్మిత్ ల మధ్య సంబంధం బాగుండటం జట్టు మంచి విజయాలు సాధించడానికి దోహదం చేసింది.. ఫైనల్లో పుణెనే గెలుస్తుందని అనుకుంటున్నా. తొలి క్వాలిఫయర్ లో ముంబైపై గెలవడం పుణెకు లాభిస్తుంది. పుణె జట్టులో బెన్ స్టోక్స్ లేని లోటును పూడ్చటం కష్టమే. కానీ గత మ్యాచ్ చివరి ఓవర్లలో రాణించిన ధోని మరొకసారి బ్యాట్ ఝుళిపించి పుణె టైటిల్ సాధించడంలో సాయపడతాడని ఆశిస్తున్నా'అని అజహరుద్దీన్ పేర్కొన్నాడు. -
ప్లే ఆఫ్ రేసులో నిలిచేదెవరో?
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఇక్కడ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కింగ్స్ పంజాబ్-రైజింగ్ పుణె జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇది ఇరు జట్లకు చివరి లీగ్ కావడంతో పాటు ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసే మ్యాచ్ కావడంతో దీనికి అధిక ప్రాధ్యాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్ లో పుణె గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ ఓటమి పాలైతే మాత్రం పుణె నాకౌట్ కు చేరడం కష్టమే. ప్రస్తుతం రన్ రేట్ ప్రకారం కింగ్స్ పంజాబ్ కాస్త మెరుగ్గా ఉండటంతో ఆ జట్టు గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరే నాల్గో జట్టుగా నిలుస్తుంది. ఇక్కడ ఇరు జట్లకు గెలుపు అనేది ముఖ్యం కావడంతో హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు. గత మ్యాచ్ లో ఢిల్లీపై పుణె ఓడిపోవడంతో ఆ జట్టుకు ఇది కీలక మ్యాచ్ గా మారిపోయింది. మరొకవైపు వరుస విజయాలతో కింగ్స్ పంజాబ్ చెలరేగిపోవడంతో పుణెను కలవర పెడుతోంది. కచ్చితంగా గెలవాల్సిన రెండు వరుస మ్యాచ్ ల్లో కింగ్స్ విజయం సాధించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పుణె తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత కింగ్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
ప్లే ఆఫ్ రేసులో నిలిచేదెవరో?
-
రైజింగ్ పుణె ఫీల్డింగ్
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లోభాగంగా గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత ఫీల్డింగ్ కు మొగ్గు చూపాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో గెలిచి ఆ లెక్కను సరిచేయాలని భావిస్తోంది పుణె. ఇప్పటివరకూ పుణె తొమ్మిది మ్యాచ్ లకు గాను ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉండగా,గుజరాత్ లయన్స్ తొమ్మిది మ్యాచ్ ల్లో నాలుగింట మాత్రమే విజయం సాధించి ఆరో స్థానంలో ఉంది. -
రాణించిన రైజింగ్ పుణె
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన పుణె ఆది నుంచి దూకుడును కొనసాగించింది. పుణె ఓపెనర్లు అజింక్యా రహానే(46;41 బంతుల్లో4 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి(38;23 బంతుల్లో 7 ఫోర్లు) మంచి ఆరంభాన్నిచ్చారు. ఈ జోడి 65 పరుగుల జత చేసిన తరువాత త్రిపాఠి తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు.ఆ తరుణంలో రహానేకు జత కలిసిన కెప్టెన్ స్మిత్ కుదురుగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 47 పరుగులు జోడించిన తరువాత రహానే పెవిలియన్ కు చేరాడు. సునీల్ నరైన్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడిన రహానే స్టంప్ అవుట్ అయ్యాడు. ఆపై స్మిత్-ధోనిలు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే స్కోరును పెంచే క్రమంలో ధోని(23;11 బంతుల్లో1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడబోయి మూడో వికెట్ గా అవుటయ్యాడు. కాగా, ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో స్మిత్(51 నాటౌట్;37 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించగా, క్రిస్టియన్(16) ఫర్వాలేదనిపించాడు. ఓవరాల్ గా పుణె బ్యాట్స్ మెన్ రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కు రెండు వికెట్లు లభించగా, ఉమేశ్ యాదవ్,సునీల్ నరైన్‌లకు తలో వికెట్ దక్కింది. -
బెన్ స్టోక్స్ దూరం
పుణె:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ బుధవారం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కోల్ కతా కెప్టెన్ గౌతం గంభీర్ తొలుత ప్రత్యర్థి పుణె ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. పుణె ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా మ్యాచ్ కు దూరమయ్యాడు. అతని స్థానంలో డు ప్లెసిస్ ను తుది జట్టులో వేసుకున్నారు. ఇదిలా ఉంచితే కోల్ కతా జట్టులోకి డారెన్ బ్రేవో వచ్చి చేరాడు. సూర్యకుమార్ యాదవ్ స్థాంనలో బ్రేవో జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకూ కోల్ కతా ఏడు మ్యాచ్ లు ఆడగా ఐదింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరొకవైపు పుణె ఏడు మ్యాచ్ లకు గాను నాలుగింటలో గెలుపొంది నాల్గో స్థానంలో ఉంది.ఈ సీజన్ లో ఇరు జట్లకు ఇదే తొలి లీగ్. గత సీజన్ లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు లీగ్ మ్యాచ్ ల్లోనూ కోల్ కతానే విజయం వరించింది. దాంతో మరొకసారి కోల్ కతానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. పుణె తుది జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠి, డు ప్లెసిస్, ఎంఎస్ ధోని, మనోజ్ తివారీ, క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఉనద్కత్, ఇమ్రాన్ తాహీర్ కోల్ కతా తుది జట్టు: గౌతం గంభీర్(కెప్టెన్); సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, మనీష్ పాండే, యూనస్ పఠాన్, గ్రాండ్ హోమ్, క్రిస్ వోక్స్, పీయూష్ చావ్లా, కుల్దీవ్ యాదవ్, ఉమేశ్ యాదవ్, డారెన్ బ్రేవో