
బెన్ స్టోక్స్ దూరం
పుణె:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ బుధవారం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కోల్ కతా కెప్టెన్ గౌతం గంభీర్ తొలుత ప్రత్యర్థి పుణె ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. పుణె ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా మ్యాచ్ కు దూరమయ్యాడు. అతని స్థానంలో డు ప్లెసిస్ ను తుది జట్టులో వేసుకున్నారు. ఇదిలా ఉంచితే కోల్ కతా జట్టులోకి డారెన్ బ్రేవో వచ్చి చేరాడు. సూర్యకుమార్ యాదవ్ స్థాంనలో బ్రేవో జట్టులోకి వచ్చాడు.
ఇప్పటివరకూ కోల్ కతా ఏడు మ్యాచ్ లు ఆడగా ఐదింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరొకవైపు పుణె ఏడు మ్యాచ్ లకు గాను నాలుగింటలో గెలుపొంది నాల్గో స్థానంలో ఉంది.ఈ సీజన్ లో ఇరు జట్లకు ఇదే తొలి లీగ్. గత సీజన్ లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు లీగ్ మ్యాచ్ ల్లోనూ కోల్ కతానే విజయం వరించింది. దాంతో మరొకసారి కోల్ కతానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.
పుణె తుది జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠి, డు ప్లెసిస్, ఎంఎస్ ధోని, మనోజ్ తివారీ, క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఉనద్కత్, ఇమ్రాన్ తాహీర్
కోల్ కతా తుది జట్టు: గౌతం గంభీర్(కెప్టెన్); సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, మనీష్ పాండే, యూనస్ పఠాన్, గ్రాండ్ హోమ్, క్రిస్ వోక్స్, పీయూష్ చావ్లా, కుల్దీవ్ యాదవ్, ఉమేశ్ యాదవ్, డారెన్ బ్రేవో