ముంబై: టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 12 నుంచి 15 వరకు జరుగనున్న ఈ టోర్నీ కోసం బుధవారం ఆటగాళ్ల వేలాన్ని నిర్వహించారు. ఈ లీగ్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పంజాబ్ బుల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. వేలంలో బుల్స్ యాజ మాన్యం రూ. 1.5 లక్షలు చెల్లించి ప్రాంజలను సొంతం చేసుకుంది.
ప్రాంజలతో పాటు అంకిత రైనా (ఢిల్లీ బన్నీస్ బ్రిగేడ్), మహక్ జైన్ (గుజరాత్ పాంథర్స్), రుతుజా (పుణే వారియర్స్) కూడా వేలంలో రూ 1.5 లక్షలు పలికారు. పురుషుల విభాగంలో ఫెనెస్టా ఓపెన్ చాంపియన్ నిక్కీ పునాచని, టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ సహ యజమానిగా ఉన్న ముంబై లియోన్ జట్టు రూ. 2.25 లక్షలకు సొంతం చేసుకుంది. నిక్కీతో పాటు సాకేత్ మైనేని (ఢిల్లీ బిన్నీస్ బ్రిగేడ్), సోమ్‌దేవ్ (గుజరాత్ పాంథర్స్), విష్ణువర్ధన్ (బెంగళూరు హ్యాక్స్), జీవన్ నెడున్‌జెళియాన్ (పంజాబ్ బుల్స్), పురవ్ రాజా (పుణే వారియర్స్)రూ. 2.25 లక్షలు సొంతం చేసుకున్నారు. ఫెనెస్టా ఓపెన్ రన్నరప్ ఆర్యన్ (ముంబై లియోన్) రూ. 1.25 లక్షలు అందుకున్నాడు. మొత్తం 8 జట్లు టీపీఎల్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ప్రతీ జట్టులో 8 మంది చొప్పున ఆటగాళ్లుంటారు.
Comments
Please login to add a commentAdd a comment