మూడో రౌండ్లో అడుగుపెట్టిన పివి సింధు | PV Sindhu enter third round; Kona-Vishnu crashes out at the World Badminton Championships | Sakshi
Sakshi News home page

మూడో రౌండ్లో అడుగుపెట్టిన పివి సింధు

Published Wed, Aug 7 2013 1:24 PM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

మూడో రౌండ్లో అడుగుపెట్టిన పివి సింధు

మూడో రౌండ్లో అడుగుపెట్టిన పివి సింధు

భారత రైజింగ్ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్‌లో ప్రపంచ 32వ ర్యాంకర్ కవోరి ఇమబెపు (జపాన్)తో జరిగిన మ్యాచ్లో 21-19 19-21 21-17తో సింధు విజయం సాధించింది. గత ఏడాది జపాన్ ఓపెన్‌లో ఇమబెపుతో ఆడిన ఏకైక మ్యాచ్‌లోనూ సింధు గెలిచింది.

ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ప్రపంచ 12వ ర్యాంకర్ పి.వి.సింధు నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన సింధు రెండో రౌండ్‌లో మ్యాచ్లో సత్తా చాటింది. గంట 11 నిమిషాలు పాటు జరిగిన మ్యాచ్లో ఇమబెపును కంగు తినిపించింది. ఈ ఏడాది మే నెలలో మలేసియా గ్రాండ్ ప్రి టైటిల్ గెల్చుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు పురుషుల డబుల్స్ నుంచి భారత ఆటగాళ్లు తరుణ్ కోనా, అరుణ్ విష్ణు రెండో రౌండ్లో పరాజయం పాలయ్యారు. ఇండోనేసియాకు చెందిన అల్వెంట్ చంద్ర, మార్కిస్ కిడో జోడీ చేతిలో 15-21 21-13 17-21తో ఓడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement