పుజౌ(చైనా): చైనా ఓపెన్ బీడబ్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సింధు 17-21, 21-17, 15-21 తేడాతో హిబింజియో(చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. తొలి గేమ్‌లో ఓటమి పాలైన సింధు.. రెండో గేమ్‌లో తేరుకుని స్కోరును సమం చేశారు. కాగా, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు మరోసారి తడబడటంతో మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. 69 నిమిషాల పాటు జరిగిన పోరులో చైనా క్రీడాకారిణి ఆద్యంతం దూకుడుగా ఆడారు. ఇది బింజియో చేతిలో వరుసగా మూడో ఓటమి. అంతకుముందు వీరిద్దరి జరిగిన రెండు మ్యాచ్‌లు రెండు గేమ్‌ల్లోనే ముగిస్తే.. ఈ మ్యాచ్ మూడో గేమ్ వరకూ వెళ్లడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment