సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రొటీస్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. చురకత్తిలాంటి బౌన్సర్లతో సఫారీ ఓపెనర్ డికాక్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఓవర్ తొలి బంతికే వెనుదిరిగాల్సిన డికాక్‌కు అదృష్టం కలిసొచ్చింది. బంతి వికెట్లను తాకినా బెల్స్ పడకపోవడంతో డికాక్ బతికిపోయాడు. అనంతరం ఐదు బంతులను ఎదుర్కొన్న డికాక్ బంతిని బ్యాట్‌కు తగిలించాడానికే ముప్పు తిప్పలు పడ్డాడు. దీంతో ఈ ఓవర్‌లో ఆతిథ్యజట్టుకు ఒక్క పరుగు కూడా రాలేదు.
పిచ్ పేస్ అనూకూలిస్తుండంతో భారత పేసర్లు సమర్ధవంతంగా ఉపయోగించుకుంటున్నారు. 5 ఓవర్లు పూర్తయ్యేసరికి దక్షిణాఫ్రికా 10 పరుగులు చేసింది. క్రీజులో ఆమ్లా(5), డికాక్(5)లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment