కొరియాతో మ్యాచ్ ‘డ్రా’
అజ్లాన్ షా హాకీ టోర్నీ
యాజమాన్యం : సన్ నెట్‌వర్క్
కెప్టెన్ : డేవిడ్ వార్నర్
ప్రధాన కోచ్: టామ్ మూడీ
బౌలింగ్ కోచ్: మురళీధరన్
మెంటార్‌లు: వీవీఎస్ లక్ష్మణ్, కె. శ్రీకాంత్
గతంలో ఉత్తమ ప్రదర్శన: విజేత (2009), సెమీస్ (2010, 2013)
ఇఫో (మలేసియా) : కొత్త కోచ్ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్ సుల్తాన్ అజ్లాన్ షా కప్‌ను భారత హాకీ జట్టు ‘డ్రా’తో ఆరంభించింది. దక్షిణ కొరియాతో ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌ను సర్దార్ సింగ్ బృందం 2-2 గోల్స్ వద్ద ‘డ్రా’గా ముగించింది. భారత్ తరఫున నికిన్ తిమ్మయ్య (10వ నిమిషంలో), వీఆర్ రఘునాథ్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించగా... కొరియాకు హైసుంగ్ హున్ (24వ నిమిషంలో), సియోంగ్‌కు లీ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు.
మ్యాచ్ మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా రఘునాథ్ చేసిన గోల్‌తో టీమిండియా ‘డ్రా’ చేసుకోగలిగింది. రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. సోమవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. గతేడాది ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సెమీఫైనల్లో కొరియాను ఓడించిన భారత్ అదే ఫలితాన్ని ఈసారి పునరావృతం చేయడంలో విఫలమైంది.
కేవలం ఒక పెనాల్టీ కార్నర్‌ను సంపాదించడం... కీలకదశలో గోల్స్ చేసే అవకాశాలను జారవిడవడంతో తుదకు భారత్ ‘డ్రా’తో సరిపెట్టుకుంది. మరోవైపు కొరియా నాలుగు పెనాల్టీ కార్నర్‌లు సంపాదించినా భారత గోల్‌కీపర్ శ్రీజేష్ అప్రమత్తత కారణంగా ఆ జట్టుకు నిరాశ తప్పలేదు.
భారత్‌ను ఆదుకున్న రఘునాథ్
Published Mon, Apr 6 2015 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM
Advertisement