Azlan Shah Cup
-
భారత్ షూటౌట్
ఇపో (మలేసియా): చివరి నిమిషాల్లో గోల్ ఇచ్చుకోవడం...ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్లో విఫలం కావడం...ఇటీవల భారత హాకీ జట్టు పరాజయాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. శనివారం అజ్లాన్ షా టోర్నీ ఫైనల్లో కూడా ఇదే తరహాలో భారత్ ఓడింది. తుది పోరులో కొరియా 4–2 తేడాతో (షూటౌట్లో) ఐదు సార్లు చాంపియన్ భారత్‌పై విజయం సాధించి సగర్వంగా టైటిల్ సొంతం చేసుకుంది. 9వ నిమిషంలోనే సిమ్రన్‌జిత్ సింగ్ చేసిన ఫీల్డ్ గోల్‌తో భారత్ 1–0తో ముందంజ వేసింది. మూడు క్వార్టర్ల పాటు మన జట్టు ఈ ఆధిక్యాన్ని కొనసాగించింది. అయితే నాలుగో క్వార్టర్ ప్రారంభం కాగానే (47వ నిమిషంలో) కొరియాకు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. భారత్ వీడియో రిఫరల్‌కు వెళ్లినా ఫలితం దక్కలేదు. జంగ్ జోంగ్ హ్యూన్ దీనిని గోల్‌గా మలచి స్కోరు సమం చేశాడు. చివర్లో పెనాల్టీ అవకాశం దక్కినా భారత్ దానిని ఉపయోగించుకోలేకపోయింది. షూటౌట్లో భారత్ తరఫున బీరేంద్ర లక్డా, వరుణ్ కుమార్ గోల్స్ నమోదు చేయగా... మన్దీప్ సింగ్, సుమీత్, సుమీర్ కుమార్ జూనియర్ గోల్ చేయడంలో విఫలమయ్యారు. వర్గీకరణ మ్యాచ్‌లో కెనడాను 4–2తో ఓడించి ఆతిథ్య మలేసియా మూడో స్థానంలో నిలిచింది. -
భారత్‌కు రెండో గెలుపు
ఇపో (మలేసియా): దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్న భారత హాకీ జట్టు మళ్లీ విజయాల బాట పట్టింది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ టోర్నమెంట్లో రెండో విజయం నమోదు చేసింది. ఆతిథ్య మలేసియా జట్టుతో మంగళవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4–2 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సుమీత్ కుమార్ (17వ, 27వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... వరుణ్ కుమార్ (36వ నిమిషంలో), మన్దీప్ సింగ్ (58వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. మలేసియా జట్టుకు రాజీ రహీమ్ (27వ నిమిషంలో), ఫిర్హాన్ అశారి (57వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ చివరి 22 సెకన్లలో గోల్ సమర్పించుకొని ‘డ్రా’తో సరిపెట్టుకుంది. మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం భారత్ ఆరంభం నుంచే పక్కా ప్రణాళికతో ఆడింది. తొలి క్వార్టర్లో ఖాతా తెరువకున్నా... రెండో క్వార్టర్లో రెండు గోల్స్ సాధించింది. అనంతరం మూడో క్వార్టర్లో, నాలుగో క్వార్టర్లో ఒక్కో గోల్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ గెలుపుతో భారత్ పాయింట్ల పట్టికలో ఏడు పాయింట్లతో దక్షిణ కొరియాతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. బుధవారం జరిగే త§ -
భారత్ శుభారంభం
ఇపో (మలేసియా): కొత్త సీజన్‌ను భారత పురుషుల హాకీ జట్టు విజయంతో ప్రారంభించింది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ వార్షిక టోర్నమెంట్లో మాజీ చాంపియన్ భారత్ శుభారంభం చేసింది. జకార్తా ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జపాన్‌తో శనివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2–0 గోల్స్ తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున ఆట 24వ నిమిషంలో వరుణ్ కుమార్... 55వ నిమిషంలో సిమ్రన్‌జిత్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. జపాన్‌పై భారత్‌కిది వరుసగా 13వ విజయం కావడం విశేషం. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా 2013లో చివరిసారి జపాన్ చేతిలో ఓడిన భారత్ ఈ టోర్నీలో చీఫ్ కోచ్, పలువురు సీనియర్ ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగింది. గతేడాది జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచి సంచలనం సృష్టించిన జపాన్ను ఏ దశలోనూ తేలిగ్గా తీసుకోని భారత్ ఆరంభం నుంచే ఓ ప్రణాళిక ప్రకారం ఆడింది. తొలి క్వార్టర్లో ఖాతా తెరవని భారత్‌కు రెండో క్వార్టర్లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను వరుణ్ కుమార్ డ్రాగ్ ఫ్లిక్‌తో బంతిని లక్ష్యానికి చేర్చాడు. అనంతరం మన్‌ప్రీత్ సింగ్, కొతాజిత్ సింగ్ మిడ్ ఫీల్డ్‌లో మంచి సమన్వయంతో ముందుకు దూసుకెళుతూ ఫార్వర్డ్ ఆటగాళ్లకు పలుమార్లు గోల్ చేసే అవకాశాలు సృష్టించారు. అయితే ఫినిషింగ్ లోపంతో భారత్ ఈ అవకాశాలను వృథా చేసుకుంది. 33వ నిమిషంలో జపాన్‌కు తొలి పెనాల్టీ కార్నర్ లభించగా... భారత గోల్‌కీపర్ శ్రీజేశ్ దానిని సమర్థంగా అడ్డుకున్నాడు. ఇక ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా జపాన్ తమ గోల్కీపర్ను తప్పించి అదనపు ఆటగాడితో ఆడింది. ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకుంది. మన్దీప్ అందించిన పాస్‌ను ‘డి’ సర్కిల్లో సిమ్రన్‌జిత్ సింగ్ డైవ్ చేస్తూ బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. -
టైటిల్ పోరులో భారత్ తడబాటు
అజ్లాన్ షా కప్‌లో రజతంతో సరి ఆస్ట్రేలియాదే స్వర్ణం ఇపో (మలేసియా): ఆరోసారి అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత్‌కు నిరాశ ఎదురైంది. ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో శని వారం జరిగిన ఫైనల్లో టీమిండియా 0-4 గోల్స్ తేడాతో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఆసీస్ తరఫున థామస్ విలియమ్ క్రెయిగ్ (25వ, 35వ నిమిషాల్లో), మాట్ గోడెస్ (43వ, 57వ నిమిషాల్లో) రెండేసి గోల్స్ సాధించారు. 33 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో ఐదుసార్లు విజేతగా నిలిచిన భారత్, రెండుసార్లు మాత్రమే రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2008లో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఓడిన భారత్, ఈ ఏడాది మరోసారి టైటిల్ పోరులో తడబడింది. తాజా ఫలితంతో ఆస్ట్రేలియా ఈ టైటిల్‌ను తమ ఖాతాలో తొమ్మిదోసారి వేసుకుంది. గతంలో ఆస్ట్రేలియా (1983, 93, 2004, 05, 07, 2011, 13, 14) ఎనిమిదిసార్లు ఈ టైటిల్‌ను దక్కించుకుంది. లీగ్ దశలో ఆసీస్ చేతిలో 1-5తో ఓడిన భారత్ ఫైనల్లో మాత్రం కాస్త పోరాటపటిమ కనబరిచింది. తొలి 25 నిమిషాల వరకు ఆసీస్‌ను గోల్ చేయనీకుండా నిలువరించింది. అయితే రక్షణ పంక్తిలో సమన్వయ లోపాలు, ఆసీస్ ఆటగాళ్ల చురుకైన కదలికలతో ఆ తర్వాత మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది. భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్లు దక్కినా ఫలితం లేకపోయింది. ఆసీస్ చేసిన నాలుగు గోల్స్ ఫీల్డ్ గోల్స్ కావడం విశేషం. ఆసీస్ జట్టు తమకు లభించిన మూడు పెనాల్టీ కార్నర్లను వృథా చేసుకుంది. -
ఫైనల్లో భారత్‌కు నిరాశ
ఇఫో(మలేషియా): సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ తుది పోరులో భారత జట్టు చతకిలబడింది. శనివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ 0-4 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. లీగ్ దశలో ఆసీస్ చేతిలో ఘోర పరాజయ చవిచూసిన భారత్ అదే ఆటను ఫైనల్లో పునరావృతం చేసి రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఆసీస్ ఆటగాళ్లలో థామస్ విలియమ్స్ క్రెయిగ్(29వ, 35 వ నిమిషాల్లో), మాట్ గోడ్స్(43వ, 58వ నిమిషాల్లో) గోల్స్ సాధించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. దీంతో ఆసీస్ తొమ్మిదో సారి టైటిల్ ను కైవసం చేసుకుంది. తొలి క్వార్టర్లో పటిష్టమైన ఆసీస్ ను భారత్ నిలువరించడంతో ఎటువంటి గోల్ నమోదు కాలేదు. కాగా ఆ తరువాత విజృంభించిన ఆసీస్ రెండో క్వార్టర్ లో రెండు గోల్స్ చేసి ఆధిక్యం సాధించింది. ఆపై మూడో క్వార్టర్ లో ఒక గోల్, చివరి క్వార్టర్ లో మరో గోల్ సాధించడంతో ఆసీస్ విజయం సంపూర్ణమైంది. -
భారత్ తడాఖా...
♦ మలేసియాపై 6-1తో గెలుపు ♦ అజ్లాన్ షా కప్‌లో ఫైనల్‌కి చేరిక ♦ నేడు ఆస్ట్రేలియాతో టైటిల్ పోరు ఇపో (మలేసియా): తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారత హాకీ జట్టు తమ తడాఖా చూపించింది. ఆతిథ్య మలేసియా జట్టును హడలెత్తించింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన టీమిండియా 6-1 గోల్స్ తేడాతో మలేసియా జట్టును చిత్తుగా ఓడించింది. తద్వారా సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో ఆరోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున నికిన్ తిమ్మయ్య (3వ నిమిషంలో), హర్జీత్ సింగ్ (7వ ని.లో), డానిష్ ముజ్తబా (27వ ని.లో), తల్విందర్ సింగ్ (50వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... రమణ్‌దీప్ సింగ్ (25వ, 39వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు. మలేసియా జట్టుకు షారిల్ సబా (46వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. శుక్రవారం జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా 3-0తో కెనడాపై, పాకిస్తాన్ 4-1తో జపాన్‌పై గెలిచాయి. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఆస్ట్రేలియా ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 18 పాయిం ట్లతో అగ్రస్థానంలో నిలువగా... 12 పాయింట్ల తో భారత్ రెండో స్థానాన్ని సంపాదించింది. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచినందుకు శనివారం జరిగే టైటిల్ పోరులో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. 3-4 స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లో మలేసియాతో న్యూజిలాండ్; 5-6 స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లో కెనడాతో పాకిస్తాన్ తలపడతాయి. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన జపాన్ చివరిదైన ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. 33 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో భారత్ ఐదుసార్లు విజేతగా నిలువగా.. ఒకసారి రన్నరప్‌గా, ఆరుసార్లు మూడో స్థానంలో నిలిచింది. 2010 తర్వాత టీమిండియా ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఫైనల్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ సమష్టిగా ఆడి సత్తా చాటుకుంది. గతేడాది మలేసియా చేతిలో కీలక మ్యాచ్‌లో ఓడిపోయి ఫైనల్ అవకాశాలను చేజార్చుకున్న టీమిండియా ఈసారి ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మూడో నిమిషంలోనే తిమ్మయ్య గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. నాలుగు నిమిషాలు గడిచాక హర్జీత్ సింగ్ రివర్స్ షాట్‌తో భారత్‌కు రెండో గోల్‌ను అందించాడు. రెండో క్వార్టర్లోనూ భారత ఆటగాళ్లు చురుకైన కదలికలతో అవకాశం దొరికినపుడల్లా మలేసియా రక్షణ వలయంలోకి దూసుకెళ్లారు. ఫలితంగా రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించారు. మూడో క్వార్టర్లో మరో గోల్‌ను చేసిన సర్దార్ సింగ్ బృందం, చివరి క్వార్టర్లోనూ మరో గోల్ చేసింది. రెండు గోల్స్ సాధించిన రమణ్‌దీప్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది. సాయంత్రం గం. 6.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
'షాయబ్ భాయ్.. మీ మోకా మళ్లీ పోయింది'
న్యూఢిల్లీ: భారత డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ నుంచి రిటైరై హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఓవైపు మైకు ముందు కామెంటరీ చెప్తూనే.. మరోవైపు సందూ దొరికినప్పుల్లా సోషల్ మీడియాలో తన సమకాలీన క్రికెటర్లను ఆటపటిస్తున్నాడు. తాజాగా ఇలాగే పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్‌పై ఓ సున్నితమైన ఛలోక్తి విసిరాడు. సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో భారత్ పాకిస్థాన్ 5-1 గోల్స్ తేడాతో ఓడించగానే ఆయన అఖ్తర్‌ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. 'సారీ షోయబ్ భాయ్. హాకీలో కూడా అవకాశం మీ చేయి జారిపోయింది. భారత్ పాక్‌ను ఓడించింది' అని పేర్కొన్నాడు. Sorry @shoaib100mph bhai hockey mai bhi mauka haath se nikal gaya #IndBeatsPak pic.twitter.com/xgrPjkTpSX — Virender Sehwag (@virendersehwag) 12 April 2016 వరల్డ్ కప్‌లో భారత్‌ను పాకిస్థాన్ ఇంతవరకు ఓడించని సంగతి తెలిసిందే. ప్రతి వరల్డ్ కప్ సమయంలో పాక్ అభిమాని ఓడిస్తామనే ఆశతో పటాకులు తెచ్చిపెట్టుకోవడం.. అవి వృథా కావడాన్ని సూచిస్తూ 'మోకా' యాడ్ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హాకీలోనూ మీ మోకా (అవకాశం) చేజారిపోయిందంటూ సెహ్వాగ్ ట్వీట్ చేయగా.. క్రీడాస్ఫూర్తితో హాస్యోక్తిని స్వీకరించిన షోయబ్.. 'నా సోదరుడు వీరూ ఏమన్నా అతని క్షమిస్తాను. ఎందుకంటే అతని హృదయం బంగారం. చెడుగా అతనెప్పుడూ మాట్లాడడు. జస్ట్ ఫన్నీ వ్యాఖ్యలు చేస్తాడు' అంటూ బదులిచ్చాడు. క్రికెట్లో భారత్-పాకిస్థాన్ జట్లకు ఏకకాలంలో వీరూ, అఖ్తర్ ప్రాతినిధ్యం వహించారు. వీరి మధ్య సాగిన బ్యాటు-బంతి హోరాహోరీ పోరాటం చాలా సందర్భాల్లో ప్రేకక్షకులను ఉర్రూతలూగించింది. -
ఆసీస్‌కు భారత్ షాక్
తిమ్మయ్య హ్యాట్రిక్ అజ్లాన్ షా హాకీ కప్ ఇపో (మలేసియా): యువ స్ట్రయికర్ నికిన్ తిమ్మయ్య హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో... అజ్లాన్ షా హాకీ కప్‌లో ప్రపంచ చాంపియన్స్ ఆస్ట్రేలియాకు భారత్ షాకిచ్చింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 4-2తో ఆసీస్‌పై నెగ్గింది. దీంతో మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే మ్యాచ్‌కు అర్హత సాధించింది. ఇప్పటికే ఫైనల్ అవకాశాలను చేజార్చుకున్న భారత్.. ఈ మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడింది. రఘునాథ్ (1వ ని.), నికిన్ తిమ్మయ్య (23, 32, 60వ ని.)లు భారత్‌కు గోల్స్ అందించారు. ఆసీస్ తరఫున బీలే (14వ ని.), గోడెస్ (53వ ని.)లు గోల్స్ చేశారు. -
భారత్‌ను ఆదుకున్న రఘునాథ్
కొరియాతో మ్యాచ్ ‘డ్రా’ అజ్లాన్ షా హాకీ టోర్నీ యాజమాన్యం : సన్ నెట్వర్క్ కెప్టెన్ : డేవిడ్ వార్నర్ ప్రధాన కోచ్: టామ్ మూడీ బౌలింగ్ కోచ్: మురళీధరన్ మెంటార్లు: వీవీఎస్ లక్ష్మణ్, కె. శ్రీకాంత్ గతంలో ఉత్తమ ప్రదర్శన: విజేత (2009), సెమీస్ (2010, 2013) ఇఫో (మలేసియా) : కొత్త కోచ్ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్ సుల్తాన్ అజ్లాన్ షా కప్‌ను భారత హాకీ జట్టు ‘డ్రా’తో ఆరంభించింది. దక్షిణ కొరియాతో ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌ను సర్దార్ సింగ్ బృందం 2-2 గోల్స్ వద్ద ‘డ్రా’గా ముగించింది. భారత్ తరఫున నికిన్ తిమ్మయ్య (10వ నిమిషంలో), వీఆర్ రఘునాథ్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించగా... కొరియాకు హైసుంగ్ హున్ (24వ నిమిషంలో), సియోంగ్కు లీ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. మ్యాచ్ మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా రఘునాథ్ చేసిన గోల్‌తో టీమిండియా ‘డ్రా’ చేసుకోగలిగింది. రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. సోమవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. గతేడాది ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సెమీఫైనల్లో కొరియాను ఓడించిన భారత్ అదే ఫలితాన్ని ఈసారి పునరావృతం చేయడంలో విఫలమైంది. కేవలం ఒక పెనాల్టీ కార్నర్‌ను సంపాదించడం... కీలకదశలో గోల్స్ చేసే అవకాశాలను జారవిడవడంతో తుదకు భారత్ ‘డ్రా’తో సరిపెట్టుకుంది. మరోవైపు కొరియా నాలుగు పెనాల్టీ కార్నర్లు సంపాదించినా భారత గోల్‌కీపర్ శ్రీజేష్ అప్రమత్తత కారణంగా ఆ జట్టుకు నిరాశ తప్పలేదు.