ఇఫో(మలేషియా): సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ తుది పోరులో భారత జట్టు చతకిలబడింది. శనివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ 0-4 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. లీగ్ దశలో ఆసీస్ చేతిలో ఘోర పరాజయ చవిచూసిన భారత్ అదే ఆటను ఫైనల్లో పునరావృతం చేసి రన్నరప్గా సరిపెట్టుకుంది.
ఆసీస్ ఆటగాళ్లలో థామస్ విలియమ్స్ క్రెయిగ్(29వ, 35 వ నిమిషాల్లో), మాట్ గోడ్స్(43వ, 58వ నిమిషాల్లో) గోల్స్ సాధించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. దీంతో ఆసీస్ తొమ్మిదో సారి టైటిల్ ను కైవసం చేసుకుంది. తొలి క్వార్టర్లో పటిష్టమైన ఆసీస్ ను భారత్ నిలువరించడంతో ఎటువంటి గోల్ నమోదు కాలేదు. కాగా ఆ తరువాత విజృంభించిన ఆసీస్ రెండో క్వార్టర్ లో రెండు గోల్స్ చేసి ఆధిక్యం సాధించింది. ఆపై మూడో క్వార్టర్ లో ఒక గోల్, చివరి క్వార్టర్ లో మరో గోల్ సాధించడంతో ఆసీస్ విజయం సంపూర్ణమైంది.
ఫైనల్లో భారత్కు నిరాశ
Published Sat, Apr 16 2016 8:11 PM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM
Advertisement