ఆదుకున్న రాహుల్
ఆదుకున్న రాహుల్
Published Mon, Aug 19 2013 1:11 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
సాక్షి, హైదరాబాద్: రాహుల్ సింగ్ (73), అనిరుధ్ (63) అర్ధసెంచరీలతో హైదరాబాద్ జట్టును ఆదుకున్నారు. అండర్-19 క్రికెట్ టోర్నీలో భాగంగా ఆదివారం బరోడాతో మొదలైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 204 పరుగలకు ఆలౌటయింది. బరోడా బౌలర్ కార్తీక్ కకడే 5 వికెట్లు తీసి హైదరాబాద్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బరోడా జట్టు తొలి రోజు ఆటముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 36 పరుగులు చేసింది.
ఆంధ్ర, కేరళ జట్ల మధ్య మ్యాచ్‌లో రెండో రోజు కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆంధ్ర జట్టుకు 15 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కేరళ జట్టులో సుబిన్ (35) మినహా ఇంకెవరూ రాణించలేకపోయారు. ఆంధ్ర బౌలర్లు శశికాంత్ 4, కార్తీక్ రామన్, శ్రీకృష్ణ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 14 ఓవర్లలో 2 వికెట్లకు 33 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 155 పరుగులు చేసింది.
Advertisement
Advertisement