రాహుల్‌కు రెండు స్వర్ణాలు
ఆసియా యూత్ వెయిట్‌లిఫ్టింగ్
సాక్షి, హైదరాబాద్: ఆసియా యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు రాగాల వెంకట రాహుల్ మెరిశాడు. థాయిలాండ్‌లోని బాంగ్‌సెన్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో అతను గురువారం భారత్‌కు మొత్తం 3 పతకాలు అందించాడు. 77 కేజీల విభాగంలో రాహుల్ 2 స్వర్ణాలు, 1 రజతం సొంతం చేసుకున్నాడు. స్నాచ్ విభాగంలో 133 కేజీల బరువు ఎత్తి రజతం సాధించిన అతను...క్లీన్ అండ్ జర్క్ (163 కేజీలు)లో స్వర్ణం, ఓవరాల్‌గా (296 కేజీలు) బంగారు పతకం గెలుచుకున్నాడు.
ఇదే చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న మరో ఏపీ అమ్మాయి ఇ. దీక్షిత 53 కేజీల విభాగంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. వచ్చే ఆగస్టులో చైనాలోని నాన్‌జింగ్‌లో జరిగే యూత్ ఒలింపిక్ గేమ్స్ కోసం అర్హత టోర్నీగా దీనిని పరిగణిస్తున్నారు. రాహుల్ విజయం పట్ల ఏపీ వెయిట్‌లిఫ్టింగ్ సంఘం కార్యదర్శి వెంకట్రామయ్య, ఏపీ స్పోర్ట్స్ స్కూల్ కోచ్ మాణిక్యాలరావు సంతోషం వ్యక్తం చేశారు.