
రాష్ట్ర బధిర క్రికెట్ జట్టు కెప్టెన్‌గా రాజారాం
సాక్షి, హైదరాబాద్: జాతీయ టి20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర బధిర జట్టును ప్రకటించారు. ఈ జట్టు కు జి.రాజారాం కెప్టెన్‌గా, మోజెస్ పీటర్ వైస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. పీర్జాదిగూడలోని బాబురావు సాగర్ గ్రౌండ్స్‌లో ఈనెల 21 నుంచి 25 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.
జట్టు వివరాలు: జి. రాజారాం, టి. అనిల్, మజర్ అలీ బేగ్, టి. సీతారాం, పి. శ్రీనివాస్, జీవీఎస్ ప్రసాద్ , పరిమళ్ కాంత్, టి.యాదగిరి, చిరంజీవి, రాజేశ్ రెడ్డి, మోజెస్ పీటర్, శివ, కె.మురళీ కృష్ణ, వీసీ రంగస్వామి, వీబీఎస్ మూర్తి, కె. నర్సింగ్, సిబిన్, వీరాచారి.