disabled team
-
తెలంగాణకు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: జాతీయ బధిర మహిళల ప్రీమియర్ లీగ్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో తెలంగాణ జట్టు రాణించింది. కంచన్‌బాగ్ వేదికగా జరిగిన ఈ టోరీ్నలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ బధిర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో మహారాష్ట్ర జట్టు విజేతగా నిలవగా, ఢిల్లీ రన్నరప్ ట్రోఫీని అందుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో మహారాష్ట్ర 8 వికెట్లతో ఢిల్లీపై గెలుపొందింది. మొదట మహారాష్ట్ర 10 ఓవర్లలో 2 వికెట్లకు 57 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఢిల్లీ 9 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నీలమ్ (15) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో తెలంగాణ 49 పరుగులతో హరియాణాను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన తెలంగాణ 10 ఓవర్లలో 2 వికెట్లకు 108 పరుగులు చేసింది. ధనలక్ష్మి (30 బంతుల్లో 51) అర్ధసెంచరీతో సత్తా చాటింది. అనంతరం హరియాణా 10 ఓవర్లలో 5 వికెట్లకు 59 పరుగులే చేసి ఓడిపోయింది. ధనలక్ష్మి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైంది. -
రాష్ట్ర బధిర క్రికెట్ జట్టు కెప్టెన్‌గా రాజారాం
సాక్షి, హైదరాబాద్: జాతీయ టి20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర బధిర జట్టును ప్రకటించారు. ఈ జట్టు కు జి.రాజారాం కెప్టెన్‌గా, మోజెస్ పీటర్ వైస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. పీర్జాదిగూడలోని బాబురావు సాగర్ గ్రౌండ్స్‌లో ఈనెల 21 నుంచి 25 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. జట్టు వివరాలు: జి. రాజారాం, టి. అనిల్, మజర్ అలీ బేగ్, టి. సీతారాం, పి. శ్రీనివాస్, జీవీఎస్ ప్రసాద్ , పరిమళ్ కాంత్, టి.యాదగిరి, చిరంజీవి, రాజేశ్ రెడ్డి, మోజెస్ పీటర్, శివ, కె.మురళీ కృష్ణ, వీసీ రంగస్వామి, వీబీఎస్ మూర్తి, కె. నర్సింగ్, సిబిన్, వీరాచారి.