
సాక్షి, హైదరాబాద్: జాతీయ బధిర మహిళల ప్రీమియర్ లీగ్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో తెలంగాణ జట్టు రాణించింది. కంచన్‌బాగ్ వేదికగా జరిగిన ఈ టోరీ్నలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ బధిర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో మహారాష్ట్ర జట్టు విజేతగా నిలవగా, ఢిల్లీ రన్నరప్ ట్రోఫీని అందుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో మహారాష్ట్ర 8 వికెట్లతో ఢిల్లీపై గెలుపొందింది. మొదట మహారాష్ట్ర 10 ఓవర్లలో 2 వికెట్లకు 57 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఢిల్లీ 9 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
నీలమ్ (15) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో తెలంగాణ 49 పరుగులతో హరియాణాను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన తెలంగాణ 10 ఓవర్లలో 2 వికెట్లకు 108 పరుగులు చేసింది. ధనలక్ష్మి (30 బంతుల్లో 51) అర్ధసెంచరీతో సత్తా చాటింది. అనంతరం హరియాణా 10 ఓవర్లలో 5 వికెట్లకు 59 పరుగులే చేసి ఓడిపోయింది. ధనలక్ష్మి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైంది.
Comments
Please login to add a commentAdd a comment