ఢిల్లీ: ఐపీఎల్‌లో భాగంగా స్థానిక ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టెన్ అజింక్యా రహానే ముందుగా బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఓటమి పాలైంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ 16 పాయింట్లలతో ప్లేఆఫ్‌కు చేరుకోగా, రాజస్తాన్ రాయల్స్ నాకౌట్ అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నాయనే చెప్పాలి. కొన్ని అద్భుతాలు జరిగితే రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్‌కు చేరే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్, కేకేఆర్ మధ్యలో రాజస్తాన్
ప్లే ఆఫ్ ముంగిట పాయింట్ల పరంగా (13 మ్యాచ్‌ల్లో 12) ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ సమంగా ఉన్నాయి. అయితే, రన్‌రేట్‌లో హైదరాబాద్ చాలా మెరుగ్గా ఉంది. శనివారం బెంగళూరుపై గెలిస్తే సన్‌రైజర్స్ 14 పాయింట్లతో ఉంటుంది. దీంతో ఆదివారం ముంబైతో మ్యాచ్‌లో కోల్‌కతా రన్‌రేట్ లెక్కలను చూసుకుంటూ నెగ్గాల్సి వస్తుంది. బహుశా పరుగుల్లో భారీ తేడాతోనో, లక్ష్యాన్ని చాలా ముందుగానో ఛేదించాల్సి రావొచ్చు. హైదరాబాద్ ఓడితే మాత్రం... కోల్‌కతాకు ఫ్లే ఆఫ్ బెర్త్ దక్కాలంటే ముంబైపై గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ... హైదరాబాద్, కోల్‌కతా తమ మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఢిల్లీపై రాజస్తాన్ నెగ్గితే ఆ జట్టు 13 పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్త్‌ను సంపాదిస్తుంది.
రాజస్తాన్
అజింక్యా రహనే(కెప్టెన్), సంజూ శాంసన్, లివింగ్ స్టోన్, రియాన్ పరాగ్, స్టువర్ట్ బిన్నీ, లామ్రోర్, కృష్ణప్ప గౌతమ్, శ్రేయస్ గోపాల్, ఇష్ సోథీ, వరుణ్ అరోన్, ఓషోన్ థామస్
ఢిల్లీ
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీషా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, కొలిన్ ఇన్‌గ్రామ్, రూథర్‌ఫర్డ్, కీమో పాల్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, ట్రెంట్ బౌల్ట్
Comments
Please login to add a commentAdd a comment