ఐపీఎల్ అధ్యక్ష పీఠంపై శుక్లా గురి | Rajeev Shukla's hat too in IPL ring | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ అధ్యక్ష పీఠంపై శుక్లా గురి

Published Mon, Apr 6 2015 8:41 AM | Last Updated on Sat, Sep 2 2017 11:56 PM

ఐపీఎల్ అధ్యక్ష పీఠంపై శుక్లా గురి

ఐపీఎల్ అధ్యక్ష పీఠంపై శుక్లా గురి

కోల్ కతా:  ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అధ్యక్ష పీఠాన్ని మరోసారి అధిష్టించాలని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ శుక్లా భావిస్తున్నారు. గత నెలలో ఐపీఎల్ ట్రెజరర్ పదవికి పోటీ చేసిన ఆయన శ్రీనివాసన్ మద్దతుదారు అనిరుధ్ చౌధురి చేతిలో ఓడిపోయారు. దాంతో ఇప్పుడు ఐపీఎల్ అధ్యక్ష పీఠంపై కన్నేశారు.

శ్రీనివాసన్ వర్గం ప్రస్తుత అధ్యక్షుడు రంజీబ్ బిశ్వాల్ నే కొనసాగించాలని భావిస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా తన మద్దతు ఎవరికి అనేది ఇంకా వెల్లడించలేదు. అయితే శుక్లా మాత్రం బోర్డులోని తన 'ఫ్రెండ్స్'ను నమ్ముకున్నారు. 2013లో టోర్నమెంట్ లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలో రాజీవ్ శుక్లా ఐపీఎల్ చైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement