
ముంబై: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ జింబాబ్వే జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నారు. మూడేళ్ల కాలానికి రాజ్‌పుత్‌ను కోచ్‌గా నియమించినట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ తరఫున రెండు టెస్టులు, నాలుగు వన్డేలు ఆడిన 56 ఏళ్ల రాజ్‌పుత్ రంజీల్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
‘కోచ్‌గా ఎంపికైనందుకు ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని ఆయన అన్నారు. తొలి టి20 వరల్డ్‌కప్ చేజిక్కించుకున్న ధోని సేనకు రాజ్‌పుత్ మేనేజర్‌గా వ్యవహరించారు. గతంలో ఆయన అఫ్గానిస్తాన్ జట్టుకు హెడ్ కోచ్‌గాను పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment