అభిషేక్ నాయర్ తలకు గాయం | Ranji semifinal | Sakshi
Sakshi News home page

అభిషేక్ నాయర్ తలకు గాయం

Published Thu, Feb 26 2015 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

అభిషేక్ నాయర్ తలకు గాయం

అభిషేక్ నాయర్ తలకు గాయం

బెంగళూరు: కర్ణాటకతో రంజీ సెమీస్ సందర్భంగా ముంబై ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్ గాయపడ్డాడు. బుధవారం మ్యాచ్ తొలి రోజు తన బౌలింగ్‌లోనే బ్యాట్స్‌మన్ కొట్టిన షాట్‌ను ఆపిన నాయర్, బంతిని త్రో చేస్తూ అలాగే మైదానంలో పడిపోయాడు. వెంటనే అతని తల నేలను ఢీకొంది. ఆ సమయంలో కొద్ది క్షణాల పాటు నాయర్ అచేతనంగా మారిపోయాడు. దాంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
 
  అయితే  సహచరులు వచ్చి లేపిన తర్వాత కోలుకున్నట్లు కనిపించిన అతను తన ఓవర్ కూడా పూర్తి చేశాడు. కానీ ఆ వెంటనే అభిషేక్‌ను మైదానంనుంచి నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లారు.  ‘నాయర్ తలకు సీటీ స్కాన్ జరిపాం. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదు. అయితే 24 గంటల పాటు  వైద్యుల  పర్యవేక్షణలో ఉంచుతున్నాం’ అని ముంబై క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి నితిన్ దలాల్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement