Abhishek Nair
-
నా గురువు.. సర్వస్వం: టీమిండియా మాజీ క్రికెటర్ వల్లే ‘హీరో’గా!
‘‘ప్రతీ విషయంలోనూ ఆయన నాకు సహాయం అందించారు. మ్యాచ్ ఆడేటపుడు నేను ఆలోచించే విధానంపై ఆయన ప్రభావం ఉంటుంది. గేమ్‌లో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై ఆయన వల్లే నాకు స్పష్టత వచ్చింది. అంతేకాదు.. ఎలాంటి ఫుడ్ తినాలి? ఎలాంటి శిక్షణ తీసుకోవాలి? అన్నవి కూడా ఆయన నిర్ణయాలకు అనుగుణంగానే సాగుతాయి. ఆయన నా గురువు. నా సర్వస్వం. ఆయనతో నాకున్న అనుబంధం ఇదే’’ అంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ యువ సంచలనం అంగ్క్రిష్ రఘువంశీ ఉద్వేగానికి లోనయ్యాడు. తనను క్రికెటర్‌గా తీర్చిదిద్దిన కోచ్ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో తన తొలి ఇన్నింగ్స్ ఆడాడు అంగ్క్రిష్. మెరుపు అర్ధ శతకంతో కేకేఆర్ తరఫున వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మెరుపు అర్ధ శతకం(27 బంతుల్లో 54)తో అలరించాడు. ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే తనదైన ముద్ర వేసి ‘హీరో’ అనిపించుకున్నాడు. ఢిల్లీపై కేకేఆర్ 106 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం 18 ఏళ్ల అంగ్క్రిష్ రఘువంశీ మాట్లాడుతూ.. తన ఆట తీరు పట్ల హర్షం వ్యక్తం చేశాడు. గత కొన్ని వారాలుగా తాను కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నానన్న అతడు.. ఢిల్లీతో మ్యాచ్‌లో తనకు అదే ఉపకరించిందని పేర్కొన్నాడు. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా ఇక తన కోచ్ గురించి ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురైన అంగ్క్రిష్.. ఆయనే తన సర్వస్వం అని పేర్కొన్నాడు. చిన్నానాటి నుంచి తన దగ్గర నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. ఇంతకీ అంగ్క్రిష్ గురువు ఎవరంటే...?! అభిషేక్ నాయర్. ఈ మెరుపులకు ఒక రకంగా మనోడే కారణం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో జన్మించిన అభిషేక్ దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహించాడు. 2009, జూలైలో వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే, మీడియం పేస్ ఆల్‌రౌండర్ టీమిండియాలో నిలదొక్కుకోలేకపోయాడు. అదే ఏడాది సెప్టెంబరులో తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. భారత్ తరఫున మొత్తం మూడు వన్డేలు ఆడి ఒక్క పరుగు కూడా చేయలేకపోయిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా అంగ్క్రిష్ రఘువంశీ ఢిల్లీలో జన్మించాడు. అయితే, పదకొండేళ్ల వయసులోనే ముంబైకి వెళ్లగా.. అక్కడ అభిషేక్ నాయర్ శిక్షణలో క్రికెటర్‌గా ఓనమాలు దిద్ది.. ఈస్థాయికి చేరాడు. ఇక అంగ్క్రిష్ దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: IPL 2024: వాళ్లకు రిషభ్ పంత్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై Innovative! Maiden IPL Fifty for Angkrish Raghuvanshi ✨ Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #DCvKKR pic.twitter.com/72oQQZIDbd — IndianPremierLeague (@IPL) April 3, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'అప్పుడు ధోని.. ఇప్పుడు టీమిండియాకు అతడే నయా ఫినిషర్'
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. విశాఖపట్నం వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో 2 వికెట్ల తేడాతో యువ భారత జట్టు ఘన విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టీమిండియా ఛేదించింది. భారత విజయంలో సూర్యకుమార్ యాదవ్(80), ఇషాన్ కిషన్(58), రింకూ సింగ్(22) కీలక పాత్ర పోషించారు. కాగా భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హైడ్రామా నెలకొంది. చివరి ఓవర్లో భారత్ గెలుపుకు 7 పరుగులు మాత్రమే అవసరం కాగా.. రింకూ సింగ్ తొలి బంతికే బౌండరీ బాది విజయానికి చేరువ చేశాడు. అనంతరం రెండో బంతికి రింకూ సింగిల్ తీసి అక్షర్ పటేల్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. అయితే ఇక్కడే మ్యాచ్ ఊహించని మలుపు తిరిగింది. మూడో బంతికి అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఔట్ కాగా.. నాలుగో బంతికి రింకూకు స్ట్రైక్ ఇచ్చే ప్రయత్నంలో బిష్ణోయ్ రనౌటయ్యాడు. అనంతరం బంతికి రెండో పరుగు తీసే క్రమంలో అర్ష్‌దీప్ కూడా రనౌటయ్యాడు. ఈ క్రమంలో ఆఖరి బంతికి భారత విజయానికి ఒక్కపరుగు అవసరమైంది. స్ట్రైక్‌లో ఉన్న రింకూ చాలా కూల్‌గా బంతిని స్టాండ్స్‌కు తరలించి జట్టును అద్భుతమైన విజయాన్ని అందించాడు. అతడు కొట్టిన బంతి నోబాల్ కావడంతో సిక్స్‌ను అంపైర్లు పరిగణలోకి తీసుకోలేదు. టీమిండియా నయా ఫినిషర్.. కాగా తీవ్ర ఒత్తిడిలో జట్టును గెలిపించిన రింకూ సింగ్‌పై భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫినిషింగ్‌లో రింకూ ఒక మాస్టర్ అని నాయర్ కొనియాడాడు. "రింకూ సింగ్ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్, దేశీవాళీ క్రికెట్లో ఈ తరహా ప్రదర్శన చేసిన వారు గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ అంతర్జాతీయ క్రికెట్లో ఫినిషర్ రోల్ పోషించడం అంత ఈజీ కాదు. రింకూ చాలా ప్రశాంతంగా మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అతడు భారత జట్టు తరపున ఈ తరహా ఇన్నింగ్స్ ఆడటం ఇది మూడో సారి. కానీ ఈ ఇన్నింగ్స్ మాత్రం రింకూకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆస్ట్రేలియా వంటి బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొవడం అంత సులభం కాదు. అతడేమి ఐదు-ఆరేళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడటం లేదు. కానీ అంతకమించి తన ఇన్నింగ్స్‌లో పరిపక్వత చూపించాడు. అతడు ఫినిషింగ్‌లో మాస్టర్లా కన్పిస్తున్నాడు. ఇప్పటివరకు ధోని, హార్దిక్ మాత్రమే భారత జట్టులో ఈ తరహా పాత్ర పోషించారు. వీరిద్దరి తర్వాత నా దృష్టిలో రింకూనే" అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాయర్ పేర్కొన్నాడు. చదవండి: రోహిత్ అలా.. కోహ్లి ఇలా.. ఎవరు మాత్రం టెంప్ట్ కాకుండా ఉంటారు?: ఆశిష్ నెహ్రా -
అభిషేక్ నాయర్ తలకు గాయం
బెంగళూరు: కర్ణాటకతో రంజీ సెమీస్ సందర్భంగా ముంబై ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్ గాయపడ్డాడు. బుధవారం మ్యాచ్ తొలి రోజు తన బౌలింగ్‌లోనే బ్యాట్స్‌మన్ కొట్టిన షాట్‌ను ఆపిన నాయర్, బంతిని త్రో చేస్తూ అలాగే మైదానంలో పడిపోయాడు. వెంటనే అతని తల నేలను ఢీకొంది. ఆ సమయంలో కొద్ది క్షణాల పాటు నాయర్ అచేతనంగా మారిపోయాడు. దాంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే సహచరులు వచ్చి లేపిన తర్వాత కోలుకున్నట్లు కనిపించిన అతను తన ఓవర్ కూడా పూర్తి చేశాడు. కానీ ఆ వెంటనే అభిషేక్‌ను మైదానంనుంచి నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ‘నాయర్ తలకు సీటీ స్కాన్ జరిపాం. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదు. అయితే 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నాం’ అని ముంబై క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి నితిన్ దలాల్ వెల్లడించారు.