ముంబై: జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్రికెట్ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్‌సలో 2 వికెట్లకు 72 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎస్ భరత్ (6 ఫోర్లతో 31), ప్రశాంత్ (5 ఫోర్లతో 24) అవుటయ్యారు. విహారి (16 బ్యాటింగ్), భార్గవ్ భట్ (0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 205/6తో శుక్రవారం తొలి ఇన్నింగ్‌సను కొనసాగించిన జమ్మూ కశ్మీర్ జట్టు 153 ఓవర్లలో 334 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లలో శివ కుమార్, భార్గవ్ భట్ నాలుగేసి వికెట్లు తీసుకోగా... విజయ్ కుమార్‌కు రెండు వికెట్లు లభించారుు.
కేరళ భారీ స్కోరు
హైదరాబాద్‌తో భువనేశ్వర్‌లో జరుగుతున్న మరో మ్యాచ్‌లో కేరళ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేరళ తొలి ఇన్నింగ్‌సలో 180 ఓవర్లలో 9 వికెట్లకు 506 పరుగులు సాధించింది. ఇక్బాల్ అబ్దుల్లా (214 బంతుల్లో 157 బ్యాటింగ్; 14 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ సెంచరీ చేయగా... ఇక్బాల్‌కు జతగా సందీప్ వారియర్ (1 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్ మూడు వికెట్లు, రవి కిరణ్ రెండు వికెట్లు తీశారు.