మేము రవిశాస్త్రిని అడిగాం: గంగూలీ | Ravi Shastri was offered Team India batting coach role: Sourav Ganguly | Sakshi
Sakshi News home page

మేము రవిశాస్త్రిని అడిగాం: గంగూలీ

Published Sat, Jul 9 2016 3:32 PM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM

మేము రవిశాస్త్రిని అడిగాం: గంగూలీ

మేము రవిశాస్త్రిని అడిగాం: గంగూలీ

కోల్కతా:భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకుని భంగపడ్డ జట్టు మాజీ డైరెకర్ట్ రవిశాస్త్రిని బ్యాటింగ్ కోచ్గా చేయాలని కోరినట్లు బీసీసీఐ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. 'కోచ్ ఇంటర్య్వూ సందర్భంగా రవిశాస్త్రిని బ్యాటింగ్ కోచ్ గా నియమించాలని అనుకున్నాం. ఆ విషయాన్ని  రవిశాస్త్రికి కూడా చెప్పాం. అయితే ఆ పదవిపై రవిశాస్త్రి ఆసక్తి చూపలేదు'అని గంగూలీ తెలిపాడు.

 శుక్రవారం తన 44వ పుట్టినరోజు సందర్భంగా గంగూలీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రికి బ్యాటింగ్ కోచ్ పదవి అప్పగించాలని అనుకున్న విషయాన్ని గంగూలీ స్పష్టం చేశాడు. అయితే గత కొన్ని రోజులుగా రవిశాస్త్రితో చోటు చేసుకున్న వివాదంపై మాత్రం గంగూలీ పెదవి విప్పలేదు. టీమిండియా అసిస్టెంట్ కోచ్ల విషయాన్ని కూడా కుంబ్లే నిర్ణయానికే వదిలివేశామని ఒక ప్రశ్నకు సమాధానంగా గంగూలీ తెలిపాడు. మరోవైపు టీమిండియా మాజీ లెఫ్టార్మ్ పేసర్ జహీర్ ఖాన్ను బౌలింగ్ కోచ్గా నియమించే అవకాశం ఉందంటూ వచ్చిన వార్తలపై గంగూలీ స్పందించాడు. ఆ విషయంపై తనకు పూర్తిగా అవగాహన లేదని, ఒకవేళ బౌలింగ్ కోచ్ పదవికి జహీర్ మొగ్గు చూపితే అతను ఏడాదంతా అందుబాటులో ఉంటాడా?లేదా?అనేది బీసీసీఐ చూసుకుంటుందని గంగూలీ పేర్కొన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement