ప్రధానికి క్రికెటర్‌ అశ్విన్‌ ట్వీట్‌ | Ravichandran Ashwin Tweet to Narendra Modi on Vote Right | Sakshi
Sakshi News home page

ఆడే చోటే ఓటు..

Published Mon, Apr 1 2019 6:43 AM | Last Updated on Mon, Apr 1 2019 6:43 AM

Ravichandran Ashwin Tweet to Narendra Modi on Vote Right - Sakshi

ఈ నెలతో పాటు మే నెలలో జరిగే లోక్‌సభ ఎన్నికల సమయంలో తాము ఎక్కడ ఉంటే అక్కడే ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని క్రికెట్‌ ఆట గాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు అశ్విన్‌ ప్రధానికి ట్వీట్‌ చేశాడు. ఎన్నికలు జరిగే సమయంలో ఐపీఎల్‌ జరుగుతోంది. దానిలో భాగంగా భారత జట్టు దేశంలోని వివిధ నగరాల్లో ఆడవలసి వస్తుంది. ఈ పోటీలు జరిగే సమయంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు తాను నివసించే పట్టణంలోనే ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన వల్ల క్రికెటర్లకు ఓటు వేసే అవకాశం ఉండదు. అయితే, తాము ఓటు తప్పని సరిగా వేయాలని, అందుకోసం తామున్న చోటే ఓటు వేసే అవకాశం కల్పించాలని ఆయన ప్రధానిని కోరారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని అశ్విన్‌ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement