హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా సోమవారం ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. ముందుగా సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో ఇరు జట్లు ముఖాముఖి పోరులో తొలిసారి తలపడుతున్నాయి. ఒకవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాలతో మంచి ఊపు మీద ఉండగా, రాయల్ చాలెంజర్స్ మాత్రం వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతోంది.
ఇప్పటివరకూ సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌లకు గాను 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉండగా, ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లో మూడింట మాత్రమే విజయం సాధించి ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. మరొకవైపు ఆర్సీబీది సంక్లిష్ట పరిస్థితి. ఇక నుంచి ఆర్సీబీ ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, ఆర్సీబీ రెండు మార్పులు చేసింది. బ్రెండన్ మెకల్లమ్, మురుగన్ అశ్విన్‌లను తప్పించింది. వారి స్థానాల్లో మొయిన్ అలీ, మనన్ వోహ్రాలను తుది జట్టులోకి తీసుకంది. ఇది మొయిన్ అలీకి ఐపీఎల్ అరంగేట్రపు మ్యాచ్.
తుది జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్
కేన్ విలియమ్సన్(కెప్టెన్), షకిబుల్ హసన్, యూసఫ్ పఠాన్, శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహా, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, మనీష్ పాండే, అలెక్స్ హేల్స్, సందీప్ శర్మ, రషీద్ ఖాన్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లి(కెప్టెన్), మొయిన్ అలీ, ఏబీ డివిలియర్స్, పార్థీవ్ పటేల్, టిమ్ సౌతీ, ఉమేశ్ యాదవ్, మన్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్, గ్రాండ్ హోమ్, మనన్ వోహ్రా, మొహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment