
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్‌లో యూపీ యోధా జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. గురువారం జరిగిన మ్యాచ్‌లో రిషాంక్ దేవడిగ (28 పాయింట్లు) అద్భుత ప్రదర్శనతో యూపీ యోధా జట్టు 53–32తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై ఘనవిజయాన్ని సాధించింది. రిషాంక్ ఒక్కడే 28 పాయింట్లు సాధించి ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. 27 సార్లు రైడ్‌కు వెళ్లిన రిషాంక్ 28 పాయింట్లు సాధించి జట్టును గెలిపించాడు. ట్యాకిల్‌లో గుర్విందర్ సింగ్ 3 పాయింట్లు స్కోర్ చేశాడు.
ఇప్పటి వరకు టోర్నీలో మొత్తం 20 మ్యాచ్‌లాడిన యూపీ జట్టు 8 విజయాలు సాధించి జోన్ ‘బి’లో 59 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. పింక్ పాంథర్స్ 21 మ్యాచ్‌లాడి 8 విజ యాలతో 51 పాయింట్లతో జోన్ ‘ఎ’లో ఐదో స్థానంలోఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్ జట్లు తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment