ధోని రికార్డును సమం చేశాడు.. | Rishabh Pant equals MS Dhonis record in Adelaide | Sakshi
Sakshi News home page

ధోని రికార్డును సమం చేశాడు..

Published Sat, Dec 8 2018 11:01 AM | Last Updated on Sat, Dec 8 2018 2:24 PM

Rishabh Pant equals MS Dhonis record in Adelaide - Sakshi

అడిలైడ్‌: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ అరుదైన ఘనతను సాధించాడు. ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ ఆరు క్యాచ్‌లను అందుకున్నాడు. ఫలితంగా ఒక టెస్టు మ్యాచ్‌లో సింగిల్‌ ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లను పట్టుకున్న భారత వికెట్‌ కీపర్ల జాబితాలో ఎంఎస్‌ ధోని సరసన నిలిచాడు. టీమిండియా తరఫున  ఎంఎస్‌ ధోని ఈ ఘనతను 2009లో సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఒక ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లను అందుకోగా, తాజాగా రిషభ్‌ పంత్‌ ఆరు క్యాచ్‌లను పట్టుకున్నాడు. ఆసీస్‌ ఆటగాడు హజల్‌వుడ్‌ ఇచ్చిన క‍్యాచ్‌ను పంత్‌ పట్టుకోవడంతో ధోని రికార్డును సమం చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ స్కోరు 235 పరుగుల వద్ద ట్రావిస్‌ హెడ్‌(72) తొమ్మిదో వికెట్‌గా ఔట్‌ కాగా, ఆపై మరసటి బంతికే హజల్‌వుడ్‌ ఔటయ్యాడు. వీరిద్దర్నీ షమీ ఔట్‌ చేయడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement