‘వదినమ్మ మా ఫిట్‌నెస్‌ను పాడు చేస్తున్నారు’ | Rishabh Pant Cute Tweet On MS Dhoni Dinner To Team India | Sakshi
Sakshi News home page

టీమిండియా ఆటగాళ్లకు ధోని విందు

Published Thu, Mar 7 2019 8:37 PM | Last Updated on Thu, Mar 7 2019 8:40 PM

Rishabh Pant Cute Tweet On MS Dhoni Dinner To Team India - Sakshi

‘సాయంత్రం ఎంతో చక్కని విందు ఇచ్చి.. బాబీజీ మా ఫిట్‌నెస్‌ లెవల్స్‌ను మీరు పాడు చేస్తున్నారు. మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు ధోనీ భయ్యా.. సాక్షి బాబీ’ అంటూ టీమిండియా ఆటగాడు రిషభ్‌ పంత్‌ చేసిన క్యూట్‌ ట్వీట్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న భారత జట్టు.. శుక్రవారం జార్ఖండ్‌లో మూడో వన్డే ఆడనున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రాంచీకి విచ్చేసిన భారత జట్టుకు జార్ఖండ్‌ డైనమెట్‌, మిస్టర్‌ కూల్‌ ధోని- సాక్షి దంపతులు తమ ఫార్మ్‌హౌజ్‌లో విందు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సహా యువ ఆటగాళ్లు రిషభ్‌ పంత్‌, చహల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘ధోనీ భాయ్‌ ప్లేస్‌లో చక్కటి విందు ఆరగించాం’ అంటూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డేకు వేదిక అయిన రాంచీ మైదానంలో బహుశా ధోనికిదే చివరి మ్యాచ్‌ కావచ్చు. ఈ నేపథ్యంలో రాంచీ విజయాన్ని ధోని కానుకగా ఇవ్వాలని భారత జట్టు యోచిస్తోంది. రేపు మధ్యాహ్నం గం.1.30ని.లకు మూడో వన్డే ఆరంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement