
రెండో టెస్టుకు టేలర్ దూరం
వెల్లింగ్టన్: దక్షిణాఫ్రికాతో గురువారం ఆరంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్ కు న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ దూరమయ్యాడు. కాలి గాయంతో బాధపడుతున్న రాస్ టేలర్ కు రెండో టెస్టు నుంచి విశ్రాంతినిస్తున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్(ఎన్జడ్సీ) తెలిపింది. అతని స్థానంలో నీల్ బ్రూమ్ ను జట్టులో స్థానం కల్పించారు.
గతేడాది పరిమిత ఓవర్ల క్రికెట్ లో అరంగేట్రం చేసిన బ్రూమ్.. ఈ ఏడాది టెస్టుల్లో ఆడటానికి రంగం సిద్ధమైంది. అప్పుడు కూడా టేలర్ స్థానంలో జట్టులోకి వచ్చిన బ్రూమ్.. ఇప్పుడు టెస్టుల్లో కూడా అదే ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం ఇక్కడ గమనార్హం.