కోచ్ అవతారం ఎత్తుతున్న టెండూల్కర్
క్రికెట్కు దూరమయ్యానన్న ఆవేదన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్లో బాగా కనిపిస్తున్నట్లుంది. అందుకే.. ఏదో ఒక రూపంలో మళ్లీ ఆ ఆటకు దగ్గర కావాలనుకున్నాడు. అంతే, ఇప్పుడు కోచ్ అవతారం ఎత్తాడు. యువ క్రికెటర్లు పర్వేజ్ రసూల్, ఉన్ముక్త్ చంద్‌లతో సహా పలువురికి శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు సచిన్ టెండూల్కర్.
ప్రముఖ క్రీడా సామగ్రి సంస్థ అడిడాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా 11 మంది యువ క్రికెటర్లకు సచిన్ శిక్షణ ఇవ్వనున్నాడు. ఈ ఇద్దరితో పాటు విజయ్ జోల్, మనన్ వోహ్రా, మన్‌ప్రీత్ జునేజా, రష్ కలారియా, చిరాగ్ ఖురానా, బాబా అపరాజిత్ లాంటి యువ క్రికెటర్లు కూడా ఈ టీమ్‌లో ఉన్నారు. యువ క్రికెటర్లలోని నైపుణ్యాన్ని ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న అడిడాస్‌కు అభినందనలు చెప్పాడు టెండూల్కర్. యువ క్రికెటర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా క్రికెట్‌కు తాను ఎంతో కొంత తిరిగిస్తున్నానన్న సంతృప్తి తనకు కలుగుతుందని అన్నాడు.