
క్వార్టర్ ఫైనల్లో సాయిదేదీప్య
హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి వై. సాయిదేదీప్య రెండు విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. హరియాణాలోని కర్నాల్‌లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-0, 7-6 (7/5)తో విభశ్రీ గౌడ (కర్ణాటక)ను కంగుతినిపించింది.
బుధవారం జరగనున్న క్వార్టర్ ఫైనల్లో దేదీప్య... పశ్చిమ బెంగాల్‌కు చెందిన యుబ్రాని బెనర్జీతో తలపడనుంది. డబుల్స్‌లోనూ దేదీప్య-హిమానీ మోర్ (హరియాణా) జంట క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.