all India tournament
-
హైదరాబాద్‌ను గెలిపించిన భండారి
చెన్నై: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు 46 పరుగుల తేడాతో రైల్వేస్ జట్టుపై గెలుపొందింది. లెగ్‌స్పిన్నర్ ఆకాశ్ భండారి (5/52), మెహదీహసన్ (3/83) హైదరాబాద్‌ను గెలిపించారు. తొలిరోజు ఆటలో హైదరాబాద్ 294 పరుగులు చేయగా... శుక్రవారం రెండో రోజు ఆటలో రైల్వేస్ 84.5 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌటైంది. అరిందమ్ ఘోష్ (79), సౌరవ్ వాకస్కర్ (54) అర్ధసెంచరీలు సాధించారు. మిగతా బ్యాట్స్‌మెన్ భండారి స్పిన్ ఉచ్చులో పడ్డారు. -
ఫైనల్లో సాయి దేదీప్య జోడి
హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి సాయి దేదీప్య డబుల్స్‌లో తుదిపోరుకు అర్హత సాధించింది. హరియాణాలోని కర్నాల్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడింది. అయితే డబుల్స్ విభాగంలో బుధవారం జరిగిన సెమీస్‌లో దేదీప్య-హిమానీమోర్ (హరియాణా) జోడి 7-5, 6-0తో రిధి శర్మ (హరియాణా)- ముస్కాన్ గుప్తా (ఢిల్లీ) జంటపై విజయం సాధించింది. గురువారం జరిగే టైటిల్ పోరులో తెలంగాణ-హరియాణా ద్వయం... నీరు-యుబ్రాని బెనర్జీ (బెంగాల్) జంటతో తలపడనుంది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి దేదీప్య 6-7 (5/7), 3-6తో యుబ్రాని బెనర్జీ చేతిలో ఓడింది -
క్వార్టర్ ఫైనల్లో సాయిదేదీప్య
హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి వై. సాయిదేదీప్య రెండు విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. హరియాణాలోని కర్నాల్‌లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-0, 7-6 (7/5)తో విభశ్రీ గౌడ (కర్ణాటక)ను కంగుతినిపించింది. బుధవారం జరగనున్న క్వార్టర్ ఫైనల్లో దేదీప్య... పశ్చిమ బెంగాల్‌కు చెందిన యుబ్రాని బెనర్జీతో తలపడనుంది. డబుల్స్‌లోనూ దేదీప్య-హిమానీ మోర్ (హరియాణా) జంట క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.