
సెమీస్‌లో సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సం ఘం (ఐటా) మహిళల టెన్నిస్ టోర్నమెం ట్లో హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాయి దేదీప్య సెమీఫైనల్‌కు చేరుకుంది. చండీగఢ్‌లో బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యా చ్‌లో దేదీప్య 7–5, 6–2తో రాష్ట్ర క్రీడాకారిణి శ్రావ్య శివానిపై విజయం సాధించింది. నేడు జరిగే సెమీస్‌లో దేదీప్య ఢిల్లీకి చెందిన శ్వేతారాణాతో పోటీపడుతుంది.