జపాన్ ఓపెన్ లో సింధు VS సైనా..!
వచ్చే వారం జపాన్ లో ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో భారత మహిళా బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు రెండో రౌండ్ లోనే తలపడే అవకాశం ఉంది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న సైనా... ప్రపంచ ఛాంపియన్ షిప్ లో రెండు కాంస్య పతకాల విజేత సింధు ఇద్దరూ తమ తొలి రౌండ్ మ్యాచ్ లు దాటితే రెండో రౌండ్ లో ఫేస్ టు ఫేస్ పోరాడాల్సి ఉంటుంది.
కాగా గత ఏడాది ఇండియన్ గ్రాండ్ ప్రి గోల్డ్ ఫైనల్ తర్వాత ఈ అగ్రశ్రేణి క్రీడాకారులు ఇద్దరు తలపడనున్నారు. ఆ మ్యాచ్ లో సింధుపై సైనా గెలవటం తెలిసిందే. ఈ ఏడాది ఇండోనేషియా ఓపెన్ సూపర్ సీరీస్ ప్రీమియర్ లోనూ, గత ఏడాది ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ సెమీఫైనల్ లోనూ ఈ టాప్ ప్లేయర్స్ ఫేస్ టు ఫేస్ మ్యాచ్ త్రుటి లో తప్పింది.