ర్యాంకుల్లోనూ పతనం | Saina Nehwal drops two places to World No8 in badminton rankings | Sakshi
Sakshi News home page

ర్యాంకుల్లోనూ పతనం

Published Fri, Dec 20 2013 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM

Saina Nehwal drops two places to World No8 in badminton rankings

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కెరీర్‌లో ఈ ఏడాది ఏ రకంగానూ కలిసి రాలేదు. ఒక్క టైటిల్ కూడా నెగ్గకుండానే సీజన్ ముగించిన సైనా ర్యాంకుల్లోనూ మరింత దిగజారింది.

గురువారం ప్రకటించిన తాజా బీడబ్ల్యూఎఫ్  ర్యాంకింగ్స్‌లో సైనా (60830 పాయింట్లు)ఎనిమిదో స్థానానికి పడిపోయింది. గత వారం ఆరో స్థానంలో ఉన్న సైనా సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో సెమీస్ కూడా చేరలేకపోవడం ర్యాంకుపై ప్రభావం చూపించింది.  పీవీ సింధు తన 11వ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement