ఏడో ర్యాంకులో సైనా | saina nehwal in seventh place | Sakshi
Sakshi News home page

ఏడో ర్యాంకులో సైనా

Published Fri, Jan 31 2014 12:27 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

saina nehwal in seventh place

సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నె హ్వాల్ ర్యాంకు మెరుగైంది. తాజాగా విడుదల చేసిన ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాం కింగ్స్‌లో ఆమె రెండు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల జరిగిన సయ్యద్ మోడి అంతర్జాతీయ గ్రాండ్ ప్రి టోర్నమెంట్‌లో హైదరాబాదీ స్టార్ టైటిల్ గెలవడంతో ర్యాంకు మెరుగైంది.
 
 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో క్రీడాకారిణి పీవీ సింధు ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని పదో ర్యాంకులో నిలిచింది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ ఏకంగా 10 స్థానాల్ని మెరుగుపర్చుకొని 20వ స్థానంలో కొనసాగుతుండగా... ఏపీ సీనియర్ ఆటగాడు కశ్యప్ 18వ ర్యాంకులో నిలిచాడు. అజయ్ జయరామ్ ఒక స్థానం కోల్పోయి 22వ స్థానానికి పడిపోయాడు. గురుసాయిదత్ 28వ, ప్రణయ్ 39వ, సాయిప్రణీత్ 45వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. సౌరభ్ వర్మ 50వ ర్యాంకులో ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement