
న్యూఢిల్లీ: కొంత కాలంగా పేలవమైన ఫామ్‌తో నిరాశ పరుస్తున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వచ్చే ఏడాది జనవరిలో ఆరంభమయ్యే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్ నుంచి వైదొలిగింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘నేను పీబీఎల్ ఐదో సీజన్ ఆడటం లేదు. గాయాలు, అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది నేను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాను. అందుకే పీబీఎల్ సీజన్ సమయాన్ని నా ఆట మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు వెచ్చించాలని నిర్ణయించుకున్నాను. తర్వాతి సీజన్‌లో ఆడేందుకు ప్రయతి్నస్తాను’ అని ట్విట్టర్‌లో తెలిపింది. పీబీఎల్‌లో సైనా హైదరాబాద్, అవ«ద్, నార్త్ ఈస్టర్న్ తరఫున సైనా బరిలో దిగింది.