ప్రసారకర్తల ఇష్టమేనా! | Saina Nehwal’s shown courage to come back, but these are matches that need to be won, says coach Vimal Kumar | Sakshi
Sakshi News home page

ప్రసారకర్తల ఇష్టమేనా!

Published Tue, Aug 29 2017 12:57 AM | Last Updated on Sun, Sep 17 2017 6:03 PM

ప్రసారకర్తల ఇష్టమేనా!

ప్రసారకర్తల ఇష్టమేనా!

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో సైనా నెహ్వాల్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ విషయంలో విమర్శలు వచ్చాయి. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం కోలుకునేందుకు తగినంత సమయం ఇవ్వకుండానే సెమీ ఫైనల్‌ ఆడించడం ఆమె ప్రదర్శనపై ప్రభావం చూపించిందని వినిపించింది. ఇందులో ప్రసారకర్తల పాత్ర ఉందని తేలింది. ఈ తరహాలో వారి ఇష్టానుసారం షెడ్యూల్‌లో మార్పులు చేయరాదని సైనా కోచ్‌ విమల్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు.

 ‘సైనాను చూస్తే బాధగా ఉంది. సెమీస్‌ కోసం ఆమెకు తగినంత సమయం ఇవ్వలేదు. ముందు రోజు రాత్రి ఆఖరి మ్యాచ్‌ ఆమెదే. మరుసటి రోజు ఉదయమే సెమీస్‌ ఆడించారు. షెడ్యూలింగ్‌లోనే సమస్య ఉంది. టీవీ ప్రసారకర్తలకు దీనిని నిర్ణయించే హక్కు ఉండరాదు. ఈ విషయంలో అధికారులదే తప్పు. శ్రీకాంత్‌కు కూడా ఇదే సమస్య ఎదురైంది’ అని విమల్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement