Coach Vimal Kumar
-
ప్రసారకర్తల ఇష్టమేనా!
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్లో సైనా నెహ్వాల్ మ్యాచ్ షెడ్యూల్ విషయంలో విమర్శలు వచ్చాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అనంతరం కోలుకునేందుకు తగినంత సమయం ఇవ్వకుండానే సెమీ ఫైనల్ ఆడించడం ఆమె ప్రదర్శనపై ప్రభావం చూపించిందని వినిపించింది. ఇందులో ప్రసారకర్తల పాత్ర ఉందని తేలింది. ఈ తరహాలో వారి ఇష్టానుసారం షెడ్యూల్లో మార్పులు చేయరాదని సైనా కోచ్ విమల్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘సైనాను చూస్తే బాధగా ఉంది. సెమీస్ కోసం ఆమెకు తగినంత సమయం ఇవ్వలేదు. ముందు రోజు రాత్రి ఆఖరి మ్యాచ్ ఆమెదే. మరుసటి రోజు ఉదయమే సెమీస్ ఆడించారు. షెడ్యూలింగ్‌లోనే సమస్య ఉంది. టీవీ ప్రసారకర్తలకు దీనిని నిర్ణయించే హక్కు ఉండరాదు. ఈ విషయంలో అధికారులదే తప్పు. శ్రీకాంత్‌కు కూడా ఇదే సమస్య ఎదురైంది’ అని విమల్ కుమార్ వ్యాఖ్యానించారు. -
సైనాపై అంచనాలు లేకపోవడం మంచిదే
కోచ్ విమల్ కుమార్ అభిప్రాయం న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ఎలాంటి అంతర్జాతీయ ఈవెంట్స్ జరిగినా స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌పై అభిమానులు పెద్దగా ఎలాంటి అంచనాలు పెట్టుకోవడం లేదనే చెప్పవచ్చు. గాయాలతో పాటు వరుస పరాజయాలు ఆమెను వెనక్కి నెడుతున్నాయి. మరోవైపు పీవీ సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్లాంటి వారు చక్కటి విజయాలతో దూసుకెళుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి ప్రతిష్టాత్మక వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సైనాకు మేలు చేస్తుందని ఆమె కోచ్ విమల్ కుమార్ అభిప్రాయపడ్డారు. 2015లో ఇదే టోర్నీలో రజతం సాధించిన తొలి భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సైనా చరిత్ర సృష్టించింది. ‘మోకాలి గాయం తర్వాత సైనా ఇబ్బంది పడుతోంది. కొన్ని గెలవాల్సిన మ్యాచ్‌లను కూడా కోల్పోయింది. స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడించే సత్తా ఉంది. ఇప్పటికైతే అందరి ఫోకస్ సైనాపై లేదు. సింధు, శ్రీకాంత్‌లపై అంచనాలున్నాయి. ఇదే తనకు మేలు చేస్తుంది. గాయం కూడా ఇబ్బంది పెట్టడం లేదు. డ్రా మాత్రం కఠినంగానే ఉంది. తొలి రౌండ్లో నెగ్గితే ప్రపంచ నంబర్ 2 సంగ్ జీతో సైనా తలపడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆమెపై సైనా నెగ్గింది’ అని విమల్ అన్నారు. -
కలుషితాహారం వల్లే...
ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో సైనా ఓటమి న్యూఢిల్లీ : ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో సైనా నెహ్వాల్ ఓటమికి కలుషితాహారమే కారణమని కోచ్ విమల్ కుమార్ తెలిపారు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్ తర్వాత సిడ్నీలోని ఓ భారతీయ రెస్టారెంట్లో ఆమె ఆహారం తీసుకుందని చెప్పారు. దీని తర్వాత ఫుడ్ పాయిజనింగ్ కావడంతో సైనా అనారోగ్యానికి గురైందన్నారు. నీరసంతో కనీసం ప్రయా ణం చేయడానికి కూడా ఇబ్బంది తలెత్తిందని, దీని కారణంగానే ఆమె మ్యాచ్‌లో ఓటమిపాలైందని తెలిపారు.