బీడబ్ల్యూఎఫ్‌లో ఒలింపిక్ కమిటీ ప్రతినిధిగా సైనా
హైదరాబాద్: భారత బ్యా డ్మింటన్ స్టార్ సైనా నెహ్వా ల్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్)లో ఒలింపిక్ కమిటీ ప్రతినిధిగా వ్యవహరించనుంది. గతేడాది రియో ఒలింపిక్స్ ఈవెంట్ ముగిసిన వెంటనే ఆమె అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లోని అథ్లెట్స్ కమిషన్ (ఏసీ) సభ్యురాలిగా నియమితులైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెను బీడబ్ల్యూఎఫ్ ప్యానెల్ సభ్యురాలిగా కూడా నియమించారు. ఈ విషయాన్ని ప్యానెల్‌లోని ఇతర సభ్యులకు తెలియజేసినట్లు బీడబ్ల్యూఎఫ్ ఏసీ తెలిపింది. రియో ఒలింపిక్స్‌లో గాయపడిన ఆమె శస్త్రచికిత్సతో కొన్నాళ్లు ఆటకు దూరమైంది. ఇటీవల మళ్లీ రాకెట్ పట్టిన ఆమె మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధిం చింది. ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న సైనా... వచ్చే నెలలో జరిగే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌పై కన్నేసింది.