
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ నుంచి తప్పుకోవాలని భావిస్తోంది. చీలమండ గాయం నుంచి కోలుకున్న ఆమె ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలనే ఉద్దేశంతో ఉంది. దీంతో వచ్చే నెలలో జరిగే ఆసియా టీమ్ ఈవెంట్‌కు దూరం కావాలనుకుంటోంది. అయితే భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) మాత్రం సైనాలాంటి మేటి క్రీడాకారిణి ఆ టీమ్ ఈవెంట్‌లో ఆడాలని పట్టుబడుతోంది.
ఉబెర్ కప్‌కు అర్హత టోర్నీ అయిన ఆసియా ఈవెంట్‌లో ఆమె ఆడితేనే భారత్‌కు అవకాశాలు మెరుగవుతాయని ‘బాయ్’ ఆశిస్తోంది. ‘థామస్ కప్, ఉబెర్ కప్‌కు ఆసియా టోర్నీ క్వాలిఫయింగ్ ఈవెంట్ కావడంతో ఇప్పుడు ఈ టోర్నీ కీలకమైంది. ఒకవేళ ఉబెర్ కప్‌కు అర్హత సాధించలేకపోతే ప్రపంచ గ్రూప్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోతాం. అందువల్లే మేటి జట్టును ఆసియా టోర్నీకి పంపాలనుకుంటున్నాం’ అని ‘బాయ్’ కార్యదర్శి అనూప్ నారంగ్ తెలిపారు. ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ మలేసియాలో వచ్చే నెల 6 నుంచి 11 వరకు జరుగనుంది. ఆల్ ఇంగ్లండ్ టోర్నీ మార్చి 14–18 మధ్య జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment